BigTV English
Advertisement

Kantara Chapter 1 : బాహుబలి రికార్డును చిత్తు చేసిన రిషబ్ శెట్టి… సాహోరే అనాల్సిందేనా ?

Kantara Chapter 1 : బాహుబలి రికార్డును చిత్తు చేసిన రిషబ్ శెట్టి… సాహోరే అనాల్సిందేనా ?

Kantara Chapter 1 :కాంతార చాప్టర్ 1 రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల రికార్డులు చూస్తే మాత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా 12 రోజుల్లోనే ఈ సినిమా మరొక మార్కును దాటేసింది. తాజాగా కాంతార చాప్టర్ 1 మూవీ బాహుబలి 1 మూవీ కలెక్షన్లను దాటేసి కొత్త రికార్డు సృష్టించింది. తగ్గేదేలే అన్నట్లు రోజురోజుకీ సినిమా కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీ.. రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ బాహుబలి:ది బిగినింగ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్ దాటేసి మైల్ స్టోన్ క్రియేట్ చేసింది..


12 రోజుల్లోనే 675కోట్ల కలెక్షన్స్..

కాంతార చాప్టర్ 1 మూవీ 700 కోట్ల కలెక్షన్స్ కి దగ్గరలో ఉంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.675 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా థియేటర్లలో 12వ రోజు ఇండియాలో 13.50 కోట్ల నికర వసూళ్లు సాధించగా.. ఆదివారం రోజు 39.75 కోట్లు సాధించింది. అలా ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే 450 కోట్ల బెంచ్ మార్క్ ని దాటేసింది. ఇప్పటివరకు కాంతార చాప్టర్ 1 మూవీ ఇండియాలో 542 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.. అలా కాంతార చాప్టర్ వన్ మూవీ రెండో వారాంతంలోనే ఏకంగా 146 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో 655 కోట్లు సాధించి 12వ రోజు 675 కోట్లకు కలెక్షన్స్ కు చేరుకుంది..

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన కాంతార 2..

అయితే ఈ సినిమా విషయంలో మరొక హైలెట్ ఏంటి అంటే.. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన టాప్ 20 ఇండియన్ సినిమాల్లోకి ఈ సినిమా కూడా ఎంట్రీ ఇచ్చింది.. అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి -1 మూవీ 650 కోట్ల కలెక్షన్స్ ని కూడా కాంతారా చాప్టర్ 1 చిత్తు చిత్తు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు అయితే ఛావా మూవీ 808 కోట్లు వసూళ్లు చేసి మొదటి ప్లేస్ లో ఉండగా..కాంతార చాప్టర్ 1 మూవీ 675 కోట్లతో రెండో ప్లేస్ లో ఉంది.ఒకవేళ ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే మాత్రం ఛావా మూవీ రికార్డును కూడా బ్రేక్ చేసి ఈ ఏడాది హైయ్యెస్ట్ వసూళ్లు కలెక్ట్ చేసిన సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..


also read:Rajinikanth : లైఫ్ ఇచ్చిన నిర్మాతను ఆదుకున్న రజనీకాంత్… ఏకంగా కోటి రూపాయలు పెట్టి..

2వ స్థానాన్ని కైవసం..

అలా బాహుబలి 1 సినిమా రికార్డును కాంతార చాప్టర్ 1 దాటేసింది అనే వార్త వినగానే చాలామంది రిషబ్ శెట్టి ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించిన పోస్టులను షేర్ చేస్తున్నారు. 2022లో వచ్చిన కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు వసూళ్లు చేసింది.. ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ని తెరకెక్కించారు. అలా ఈ మూవీకి రిషబ్ శెట్టి హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ గ్లామరస్ పాత్రలో మెరిసింది. గుల్షన్ దేవయ్య, జయరాం వంటి వాళ్లు కీరోల్స్ పోషించారు.

Related News

Siddu Jonnalagadda : చేతిలో మైక్ ఉంటే… ఊమనైజర్ కామెంట్స్‌పై హీరో సిద్దు ఘాటు కౌంటర్

Mithra Mandali: మిత్రమండలి పై లిటిల్ హార్ట్స్ ఫార్ములా .. వర్కౌట్ అయ్యేనా?

Meesala Pilla : మీసాల పిల్ల పాట వచ్చేసింది, మెగా ఫ్యాన్స్ కి కావాల్సిందే ఇదే

Ram Pothineni : రామ్ పోతినేనికి యాటిట్యూడ్.. లవ్ స్టోరీపై రామ్ రియాక్షన్

Sreeleela New Look : హాట్ హాట్ ‘మిర్చి’ ఏజెంట్… శ్రీలీల కొత్త లుక్ చూశారా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న మరో డిజాస్టర్ డైరెక్టర్… అదే జరిగితే..

Rajinikanth : లైఫ్ ఇచ్చిన నిర్మాతను ఆదుకున్న రజనీకాంత్… ఏకంగా కోటి రూపాయలు పెట్టి..

Big Stories

×