Burping Causes: తేన్పుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతి ఒక్కరికీ తరచుగా తేన్పులు వస్తూనే ఉంటాయి. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు కొంత గాలి లోనికి వెళ్తున్నది. ఈ గాలి జీర్ణాశయం పై భాగంలో నిలిచిపోతుంది. జీర్ణాశయం కాస్త ఉబ్బుతుంది. ఆ సమయంలో అన్నవాహిక, జీర్ణాశయం కలిసే చోట కండరం కాస్త తెరచుకుంటుంది. దీంతో గాలి తేన్పుల రూపంలో బయటకు వస్తుంది. తేన్పులు రావడం వల్ల జీర్ణాశయానికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ, అతిగా తేన్పులు రావడం మంచిదికాదంటున్నారు నిపుణులు. అతిగా తేన్పుల రావడం వల్ల జీర్ణరసాలు గొంతులోకి వచ్చి, అన్నవాహిక క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది.
తేన్పులు అతిగా రావడానికి కారణాలు
జీర్ణాశయంలోని జీర్ణ రసాలు గొంతులోకి రావడం వల్ల తేన్పులు అతిగా వస్తాయి. వేగంగా తినడం, తాగడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, ధూమపానం, మద్యపానం కారణంగా తేన్పులు ఎక్కువగా వస్తాయి. తేన్పులు రావడానికి ఇతర కారణాలు..
⦿ అజీర్ణం
తీసుకున్న ఆహారం సరిగా జీర్ణంకాని సమయంలో తేన్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అజీర్ణం కారణంగా ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం, తేన్పులతో పాటు అనారోగ్యంగా అనిపిస్తుంది. గొంతులోకి ఘాటైన ఆమాల్లు వచ్చి మంట ఏర్పడుతుంది. తిన్న తర్వాత కనీసం మూడు గంటలకు నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు రావు. స్పైసీ, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా అజీర్ణం ఏర్పడుతుంది.
⦿ ఆమ్లాలు పైకి రావడం
జీర్ణాశయంలోని ఆమ్లాలు అన్నవాహికలోకి ఎగదన్నండం వల్ల గుండెల్లో మంట ఏర్పడుతుంది. దగ్గు, ఎక్కిళ్లు వస్తుంటయి. నోటి దుర్వాసన, ఉబ్బరం, అనారోగ్యం కలుగుతుంది. కాఫీ,టమాటాలు, ఆల్కహాల్, చాక్లెట్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం ఎసిడిటీ ఏర్పడుతుంది.
Also Read: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి
⦿ గ్యాస్ట్రిటిస్
గ్యాస్ట్రిటిస్ కారణంగా కడుపు ఎగువ భాగంలో నొప్పితో పాటు అసౌకర్యం కలుగుతుంది. భోజనం తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులుతో పాటు ఆకలి తగ్గుతుంది. వారం రోజుల కంటే ఎక్కువ కడుపునొప్పి, అజీర్ణ సమస్యలు తలెత్తితే డాక్టర్ ను సంప్రదించాలి.
⦿ కడుపులో పూత
అజీర్ణం కారణంగా పొట్టలో పుండ్లు ఏర్పడుతాయి. దీనిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనికూడా పిలుస్తారు. పేగు గోడలలో పుండ్లు ఏర్పడుతాయి. కడుపులో పుండ్లు ఏర్పడ్డం వల్ల మంట, నొప్పి ఏర్పడుతుంది.
తేన్పులు రాకుండా ఉండాలంటే..
కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల తేన్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
⦿ భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినాలి.
⦿ ద్రావణాలు తాగే సమయంలో నెమ్మదిగా తాగాలి.
⦿ తేన్పులు ఎక్కువగా వస్తే బ్రోకలీ, క్యాబేజీ, బీన్స్, పాల ఉత్పత్తులకు కాస్త దూరంగా ఉండటం మంచిది.
⦿ సోడా, బీర్ లాంటి ఫిజీ డ్రింక్స్ మానుకోవాలి.
⦿ చూయింగ్ గమ్ తినకూడదు.
⦿ ధూమపానానికి దూరంగా ఉండాలి.
⦿ తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల జీర్ణ సమస్యలు రావు.