BigTV English

Obesity: మహిళల్లో అధిక బరువు సమస్య.. ముప్పు తప్పదంటున్న వైద్యులు

Obesity: మహిళల్లో అధిక బరువు సమస్య.. ముప్పు తప్పదంటున్న వైద్యులు

Obesity and cervical cancer: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్న వారు ప్రస్తుత కాలంలో చాలా మంది ఉన్నారు. అధిక బరువు అనేది అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా మారుతోంది. అధిక బరువు గర్భాశయ క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయానికి గర్భాశయ క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇమ్యూనిటీ:
శరీరంలో అధిక కొవ్వు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ కణాలను గుర్తించడం, నాశనం చేయడంలో కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాలను గుర్తించడం, వాటిని తొలగించడంలో రోగనిరోధక వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
హార్మోన్ అసమతుల్యత:
హార్మోన్ అసమతుల్యత కారణంగా స్త్రీలు అధికంగా బరువు పెరుగుతున్నారు. హార్మోన్ హెచ్చుతగ్గులు గర్భాశయ క్యాన్సర్ కారణాల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. శరీరంలో కొవ్వు కణాలు అధిక ఈస్ట్రోజన్‌ ఉత్పత్తికి కారణం అవుతాయి. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అధికంగా కొవ్వు ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అధిక బరువు ప్రొజెస్టిరాన్ తక్కువ స్థాయిలో ఉత్పత్తి కావడానికి దారితీస్తుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్:
ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో సాధారణంగా ఇన్సులిన్ నిరోధక ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్. శరీర కణాలు తక్కువగా స్పందించినప్పుడు ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. ఇది ఇన్సులిన్ వంటి వృద్ధి కారకాల స్థాయిలతో పాటు రక్తప్రవాహంలో ఇన్సులిన్ అధిక స్థాయిలో పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. గర్భాశయ క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఇన్సులిన్ నిరోధకత కారణం అవుతుంది.

Also Read: మీరు వాడే టూత్ పేస్ట్ ఇలాంటిదేనా.. అయితే నోటి క్యాన్సర్ బారిన పడినట్లే


గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. సమతుల్య ఆహారం తీసుకోవడం,  బరువును తగ్గించుకోవడం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి మార్గాలు. అధిక బరువు అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. అధిక బరువు వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ కేసులు తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×