Pedicure: సాధారణంగా, మహిళలు తమ ముఖ చర్మం మెరిసేలా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వారు తమ పాదాల చర్మంపై అంత శ్రద్ధ చూపించరు. దీని కారణంగా పాదాలపై ఉన్న చర్మం నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. మరి పాదాలు అందంగా కనిపించడంతో పాటు పాదాల చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడానికి పాటించాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్:
ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌లో పచ్చి పాలను కలిపి మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేసి, ఈ పేస్ట్‌ను పాదాలకు రుద్దండి. ఈ పేస్ట్‌ను పాదాలకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. మీరు దీన్ని వారానికి మూడు సార్లు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నలుపు పోవడంతో పాటు పాదాల మెరుపు కూడా పెరుగుతుంది.
నిమ్మకాయ:
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు అప్లై చేయండి. మరుసటి రోజు ఉదయం, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తరువాత మీ పాదాలకు మాయిశ్చరైజర్ రాయండి. ముందుగా నిమ్మకాయను మధ్యలో నుండి రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ నిమ్మకాయ రసంలోకాస్త చక్కెర వేసి, ఈ నిమ్మకాయ రసాన్ని కాటన్ సహాయంలో పాదాలపై ఉన్న నల్లని చర్మంపై కాసేపు రుద్దండి. ఇలా చేయడం వల్ల పాదాలకు స్క్రబ్బింగ్ అవుతుంది. ఇది పాదాల నలుపును పోగొట్టడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి బ్లీచింగ్ ఏజెంట్‌గా కావడం వల్ల పాదాల ఛాయను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
అలోవెరా:
పాదాల నల్లదనాన్ని తొలగించడానికి, అర బకెట్ నీటిలో బేకింగ్ సోడా, ఉప్పు, అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు మీ పాదాలను ఈ బకెట్‌లో కొంతసేపు ఉంచండి. దీని తరువాత, మీ పాదాలను రుద్దండి. ఆ తరువాత కాళ్లను బయటకు తీసి శుభ్రం చేయండి. తర్వాత మీ పాదాలను టవల్ తో తుడిచి ఆరబెట్టండి. అనంతరం కాళ్లకు మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ఇది పాదాల నల్లదనాన్ని తొలగించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా పాదాల డెడ్ స్కిన్ ను కూడా తొలగిస్తుంది.
శనగ పిండి:
శనగ పిండి, పెరుగు మిశ్రమం పాదాల నల్లదనాన్ని తొలగించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీస్పూన్ పెరుగు వేసి పేస్ట్ లాగా చేయండి. ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగి ఈ పేస్ట్‌ను అప్లై చేయండి. ఇది పూర్తిన ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. అనంతరం మాయిశ్చరైజర్ రాయండి. మీరు ప్రతిరోజు ఈ ప్రక్రియను చేయవచ్చు.
Also Read: పసుపుతో మొటిమలు లేని.. గ్లోయింగ్ స్కిన్
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా, టమాటోలను ఉపయోగించడం ద్వారా కూడా పాదాల నలుపును పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం రెండు చెంచాల బేకింగ్ సోడా తీసుకుని అందులో టమాటా రసం, కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమంతో మీ పాదాలను స్క్రబ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇదే కాకుండా, మీరు ఒక చెంచా బేకింగ్ సోడాలో రోజ్ వాటర్ కలిపి తయారుచేసిన పేస్ట్‌ను కూడా అప్లై చేయవచ్చు. ఈ పేస్ట్‌ను పాదాలకు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, సాధారణ నీటితో కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.