Turmeric For Skin: శతాబ్దాలుగా పసుపును చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. పచ్చి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా మొటిమలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి పసుపును శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. పసుపును ఉపయోగించడం వల్ల ముఖాన్ని కాంతివంతంగా మారడంతో పాటు నల్లటి వలయాలు, మొటిమలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపును శరీరంపై గాయాలు అయినప్పుడు కూడా గాయాలపై పూస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది గాయాలను త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది.
పసుపు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి కూడా పని చేసే శీతలీకరణ గుణాన్ని కలిగి ఉంటుంది. పచ్చి పసుపుతో ఫేస్ ప్యాక్‌లు, స్క్రబ్‌లు, ఫేస్ మాస్క్‌లను తయారు చేసి ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
పచ్చి పసుపు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు:
మొటిమలను తగ్గిస్తుంది: పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: పసుపులో ఉండే కర్కుమిన్ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
చర్మాన్ని టోన్ చేస్తుంది: పసుపు చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై ఉన్న జిడ్డును తొలగిస్తుంది.
చర్మాన్ని మృదువుగా చేస్తుంది: పసుపు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
నల్లటి వలయాలను తగ్గిస్తుంది: పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.
అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది: పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది సన్ బర్న్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పచ్చి పసుపును ఎలా ఉపయోగించాలి ?
ఫేస్ ప్యాక్:
పచ్చి పసుపుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని చేయడానికి, 1 టేబుల్ స్పూన్ పచ్చి పసుపు పొడిలో 1/2 స్పూన్ పెరుగు, తేనెను కలపండి. ఆ తర్వాత దీనిని పేస్ట్ లాగా చేయండి. ఇలా తయారు చేసిన ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత కడిగేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల మీ ముఖంలో మెరుపు కనిపిస్తుంది.
Also Read: శనగపిండితో అమ్మాయిలే అసూయపడే అందం !
స్క్రబ్:
పచ్చి పసుపు స్క్రబ్ చర్మంలోని మృతకణాలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి, పచ్చి 1 టేబుల్ స్పూన్ పచ్చి పసుపు పొడిలో 1/2 స్పూన్ బియ్యం పిండి, అందులో రోజ్ వాటర్ కలపడం ద్వారా స్క్రబ్ సిద్ధం అవుతుంది. ఇలా తయారు చేసిన ఈ స్క్రబ్‌ని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. దీనిని వాడటం వల్ల ముఖ చర్మం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.