Big Stories

Monsoon Health Care: వర్షాకాలం వచ్చేసింది.. ఈ వ్యాధుల పట్ల తస్మాత్ జాగ్రత్త..

Monsoon Health Care: వేసవి కాలం ముగియడానికి వచ్చింది. ఇప్పటికే వర్షాలు కూడా మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒక్కోచోట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా కురిసే వర్షాలు లేదా భారీ వర్షాల కారణంగా పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు వానలో తడవడం వల్ల చర్మ రోగాలు కూడా ఏర్పడతాయి.

- Advertisement -

వర్షాకాలంలో దోమలు, ఈగలు, చిన్న చిన్న పురుగులు ఎక్కువగా తిరుగుతుంటాయి. వర్షం పడిందంటే చాలు ఎక్కడ చూసినా దోమలు, ఈగల బెడద మొదలవుతుంది. వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధుల బారినపడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

- Advertisement -

వర్షాల కారణంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వర్షంలో తడవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యలు తప్పవు. అందువల్ల వర్షంలో తడిస్తే వెంటనే వేడి నీరు కాచుకుని ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే నీళ్లలో కాస్త పసుపు వేసుకుని పట్టడం వల్ల జలుబు త్వరగా తగ్గిపోతుంది. ఆవిరి పట్టే సమయంలో అందులో కొంచెం జెండూబామ్ వేసుకుని ఆవిరి పట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. శ్వాస సంబంధింత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షంలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలి. మరోవైపు వర్షకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో నిమోనియా కూడా ఉంటుంది. అందువల్ల సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్ వంటివి సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి, బయటకు వెళ్లి వచ్చిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News