Skin Care Tips: ముఖం అందంగా కనిపించడం కోసం బయట దొరికే రసాయనాలతో చేసిన ప్రొడక్ట్స్ కంటే హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. పాలు, పసుసుతో తయారు చేసే కొన్ని హోం రెమెడీస్ ఫేస్ గ్లో పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పచ్చి పాలలో పసుపు కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.
పచ్చి పాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి ఇవి సహాయపడతాయి. పసుపు, పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్నింటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
వీటితో చర్మానికి కలిగే ప్రయోజనాలు..
క్లీన్ స్కిన్:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫేస్ పై మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పాలు చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.
ఫేస్ గ్లో పెరుగుతుంది:
పసుపులో ఉండే కర్కుమిన్ సహజంగా చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంతే కాకుండా సమానమైన ఛాయను అందిస్తుంది. పసుపును పాలలో కలిపి రాసుకుంటే చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోయి మృదువుగా మారుతుంది.
చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది:
వయసు పెరిగే కొద్దీ ముఖంపై గీతలు, ముడతలు రావడం మొదలవుతాయి. అలాంటి వారు పాలు పసుపు మిశ్రమం వాడటం వల్ల చర్మం ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది.
చర్మానికి పోషణనిస్తుంది:
పాలలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మ రక్షణ:
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి అంతే కాకుండా వృద్ధాప్య ప్రభావాలను కూడా తగ్గిస్తాయి.
Also Read: ఫ్లాక్ సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం
ఎలా తయారు చేయాలి?
ఒక గిన్నెలో కొద్దిగా పచ్చి పాలను తీసుకుని అందులో చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత ఒక చెంచాతో పసుపును బాగా కలపండి. దీని తరువాత, ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 నుండి 3 సార్లు ముఖానికి అప్లై చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. ముఖంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. మీ ఫేస్ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా వాడటం వల్ల ఫేస్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.