Teddy Day 2025: వాలైంటైన్ వీక్ లో ఫిబ్రవరి 10 వ తేదీన టెడ్డీ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు తమ భాగస్వామికి టెడ్డీ బేర్‌లను గిఫ్ట్‌గా ఇస్తారు. టెడ్డీ బేర్ అనేది ఒక మృదువైన బొమ్మ. ఇవి చూడటానికి చాలా ముద్దుగా, అందంగా ఉంటాయి. వీటిని చిన్న పిల్లలు, అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. ఇదిలా ఉంటే వాలంటైన్ వీక్ సందర్భంగా అబ్బాయిలు తాము ప్రేమించే అమ్మాయిలకు టెడ్డీ డే రోజున టెడ్డీ బేర్ లను బహుమతిగా ఇస్తుంటారు.
అమ్మాయిలను ఆకట్టుకోవడానికి అంతే కాకుండా వారి పట్ల తమ ప్రేమను తెలపడానికి టెడ్డీలను ఇస్తుంటారు. టేడ్డీ బేర్ ప్రేమ, కరుణ, భద్రతకు చిహ్నంగా చెబుతారు. వివిధ రకాల టెడ్డీ బేర్లు వివిధ రకాల భావాలను వ్యక్త పరుస్తాయి. మీరు కూడా మీ ప్రేమికులకు టెడ్డీ బేర్‌లను గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం ఏ రంగు టెడ్డీ బేర్ మీ మనసులోని భావాలను తెలపడానికి సెట్ అవుతుందో తెలుసుకోండి.
రెడ్ టెడ్డీ బేర్ :
రెడ్ కలర్ టెడ్డీ బేర్ గనక మీరు ఇస్తే.. ప్రేమకు గుర్తు అని భావించాలి. ఎర్రటి టెడ్డీ బేర్ తో పాటు చాక్లెట్ కూడా ఇస్తే.. మీరు మీ లవర్ తో మీ బంధాన్ని శాశ్వతంగా ఉంచాలని కోరుకుంటున్నారని అర్థం. అంటే మీరు మీ పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నారని అర్థం.
గులాబీ రంగు :
గులాబీ రంగు టెడ్డీ బేర్ మీరు లవర్‌కు ఆకర్షితులయ్యారని తెలుపుతుంది. అంతే కాకుండా మీరు వారితో ఉండాలని కోరుకుంటున్నట్లు సూచిస్తుంది.
పసుపు రంగు:
పసుపు రంగు టెడ్డీ బేర్ లో లవ్ లెటర్ పెట్టి మీరు గిఫ్ట్ గా ఇస్తే.. వారి సమయాన్ని మీరు కోరుకుంటున్నారని అర్థం. మూడు పసుపు రంగు టెడ్డీ బేర్ లు ఇస్తే.. లోతైన స్నేహాన్ని కోరుకుంటున్నారని అర్థం.
ఒక వేళ మీరు మీ భాగస్వామికి టెడ్డీ బేర్ లను ఇవ్వకూడదనుకుంటే టెడ్డీ బేర్ ఆకారంలో ఉన్న గిఫ్టులను కూడా ఇవ్వవచ్చు. అంతే కాకుండా కీ చైన్లు, పెండెట్లు, బ్రాస్లెట్లు మార్కెట్ లో సులభంగా లభిస్తున్నాయి. వాటిని కూడా ఇవ్వవచ్చు.
ప్రేమికుల రోజున మీ ప్రేమను వ్యక్తపరచడానికి లవ్ టెడ్డీ బేర్ చాలా రొమాంటిక్ బహుమతి. దానిపై “ఐ లవ్ యు” లేదా హార్ట్ ఆకారంలో అందమైన డిజైన్ ఉంది. ఇది మీ భావాలను మాటల కంటే సమర్థవంతంగా వ్యక్తపరుస్తుంది. ఈ బహుమతి మీ ప్రేమకు కొత్త ,అందమైన రూపాన్ని ఇస్తుంది.
టెడ్డీ బేర్ పైన ఫోటో లు ఉన్న బహుమతులు చాలా ప్రత్యేకమైనవి. మీరు మీ భాగస్వామి పేరు లేదా ఏదైనా ఫోటోతో పాటు స్పెషల్ డేట్ అందులో ఉంచవచ్చు. ప్రతి జంట ఇలాంటి బహుమతులను ఇష్టపడతారు. ఈ బహుమతి మీ సంబంధంలోని ప్రతి క్షణాన్ని మరింత అందంగా మారుస్తుంది.
Also Read: ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి.. కుంకుమ పువ్వు బెస్ట్ ఆప్షన్
మీరు మీ భాగస్వామికి దూరంగా నివసిస్తుంటే రెండు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ భావాలను ఈజీగా తెలియజేయవచ్చు. వీటిని కొనేటప్పుడు టెడ్డీ బేర్లు రెండు వేర్వేరు రంగులలో ఉండాలని గుర్తుంచుకోండి. ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళ హృదయాలు దగ్గరగా ఉన్నాయని ఇవి చూసిస్తాయి.