BigTV English

Blood Group : మీది ఈ వర్గానికి చెందిన బ్లెడ్ గ్రూపేనా – ఐతే.. మీరు అంత త్వరగా ముసలోళ్లు అవ్వరు

Blood Group : మీది ఈ వర్గానికి చెందిన బ్లెడ్ గ్రూపేనా – ఐతే.. మీరు అంత త్వరగా ముసలోళ్లు అవ్వరు

Blood Group : మీ బ్లడ్ గ్రూప్ ఎప్పుడైనా తెలుసుకున్నారా.. ఎందుకు రక్తం దానం చేసేందుకా లేదా ఏదైనా ప్రమాదం జరిగితే అవసరం అవుతుందనా.. ఇలాంటి ప్రశ్నలు అడగకండి. మరెందుకు.. బ్లడ్ గ్రూప్ గురించి అడుగుతున్నారు అంటారు. ఎందుకంటే.. మీ బ్లడ్ గ్రూప్ బట్టే మీ యవ్వనం ఉంటుందంటా. ఏంటి ఆశ్చర్యపోతున్నారా. నిజం.. ఇటీవలే ఈ విషయంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. మనిషిలోని బ్లడ్ గ్రూప్ వారి యవ్వనత్వంపై ప్రభావం చూపుతుందని కనిపెట్టారు. అయితే.. ఇదంతా ఏదో సెరాయిడ్లు, ఇతర కాస్మెటిక్స్ తో సంబంధం ఉన్న విషయం కాదు. నేరుగా మన పుట్టుకతో వచ్చే రక్త వర్గాన్ని బట్టే ఈ విషయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరి అదెలాగో.. మీరే తెలుసుకోండి.


మనుషులకు ప్రాథమికంగా నాలుగు రక్త వర్గాలు ఉంటాయని చిన్నప్పటి నుంచి తెలుసుకున్నదే. ఇందులో మన వర్గాన్ని బట్టి.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్త మార్పిడి చేస్తారని తెలుసు. అయితే.. అవి ఏంటి, ఎందుకు వ్యత్యాసం అని ఆలోచించారు. ఎందుకంటే.. రక్తంలోని ఎర్ర రక్త కణాలు, ప్లాస్మాలో ఉండే అణువుల ఆధారంగా వర్గాలు మారిపోతాయి. ఎక్కువగా తెలిసిన వర్గాలు అంటే గ్రూప్ A – ఎర్ర రక్త కణాలలో A యాంటిజెన్, ప్లాస్మాలో B యాంటిజెన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఉండే వర్గం. అలాగే.. గ్రూప్ B – ఎర్ర రక్త కణాలలో B యాంటిజెన్, ప్లాస్మాలో A యాంటిజెన్‌కు ప్రతిరోధకాలు ఉంటుంటాయి. అలాగే.. గ్రూప్ AB – రెండు యాంటిజెన్‌లు (A,B) ఉంటాయి. ఏ రక్త సమూహానికి వ్యతిరోధకాలు ఉండవు. వీరు ఏ రకమైన రక్తాన్ని అయినా తీసుకోవచ్చు. అదే విధంగా.. గ్రూప్ O – ఎర్ర రక్త కణాలపై యాంటిజెన్‌లు ఉండవు, కానీ A, B గ్రూపులకు ప్రతిరోధకాలు ఉంటాయి. ఈ కారణంగానే.. వీరు ఏ రక్తాన్ని అయినా స్వీకరించగలరు, కానీ ఎవరికీ దానం చేయలేరు.

రక్తం వల్ల వృద్ధాప్యం నెమ్మదిస్తుందా?


వృద్ధాప్యాన్ని నెమ్మదించే ఔషధాలు కనిపెట్టేందుకు అంతర్జాతీయంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. అనేక విషయాలు మన అవగాహనలోకి వస్తున్నాయి. అందులో భాగంగానే.. ప్లానెట్ టుడే నిర్వహించిన అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అన్ని రక్త వర్గాల్లో కంటే B గ్రూప్ బ్లడ్ ఉన్న వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారంట. వీరితో పోల్చితే.. మిగతా రక్త వర్గాలకు చెందిన వారు త్వరగా వృద్ధాప్యాన్ని పొందుతారు అంటున్నారు. అంటే.. ఈ రక్త వర్గంలో ఉన్న వాళ్లు అసలు వృద్ధులు కారని కాదు.. కానీ, వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమత్తులు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు.

అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలు మనకు తెలిసిన విషయాలతో సంపూర్ణ యవ్వనం సాధ్యం కాదు. కాకపోతే.. అందుకోసం ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. కణాల పునరుత్పత్తి, రక్త సమూహాల మధ్య సంబంధాన్ని మాత్రం ఈ పరిశోధన ద్వారా కనుక్కోగలిగారు. జపనీస్ స్టడీ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ జెరోంటాలజీ, BMC మెడిసిన్ అధ్యయనాల ప్రకారం.. B బ్లడ్ గ్రూప్ ఉన్నా వారికి సుదీర్ఘ ఆయుర్దాయం ఉందని తెలింది. మరో అధ్యయనంలో మాత్రం.. A, B బ్లడ్ గ్రూప్ లకు చెందిన వారికి.. గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ తో మరణించే ప్రమాదం ఎక్కువ అని గుర్తించారు. అలాగే.. A, B లేదా AB రక్త వర్గానికి చెందిన వారు సాధారణంగా ఏదైనా వ్యాధితో మరణించే అవకాశం 9% ఎక్కువగా, గుండె సంబంధిత వ్యాధులతో మరణించే అవకాశం 15% ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Also Read

అదీ సంగతి.. యవ్వనం కోసం చేస్తున్న పరిశోధనల్లో.. B గ్రూప్ బ్లడ్ వాళ్లకు ఉన్న అదనపు ప్రయోజనాలతో పాటు మిగతా వర్గాల వారికి ఉన్న కొన్ని ముప్పులు సైతం బయటపడ్డాయి. ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ సర్వే ఫలితాలు.. అంతర్జాతీయంగా అనేక మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రముఖంగా అచ్చయ్యాయి.

ఏ బ్లడ్ గ్రూపు వారైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. చెడు జీవనశైలి అనేది ఎవరికైనా సమస్యలనే తెచ్చిపెడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తాజా ఆహారానికి కొలెస్ట్రాల్ లేని ఆహారానికి పెద్దపీట వేయాలి. పండ్లు, కూరగాయలు, నీళ్లు అధికంగా తింటూ ఉండాలి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×