BigTV English
Advertisement

Women Health Problems: ఈ సమస్యలు ఆడవారికే ఎక్కువగా వస్తాయట.. మీలో కూడా ఉన్నాయేమో చూసుకోండి!

Women Health Problems: ఈ సమస్యలు ఆడవారికే ఎక్కువగా వస్తాయట.. మీలో కూడా ఉన్నాయేమో చూసుకోండి!

Women Health Problems: మహిళలు ఇంట్లో ఎక్కువ పని అవ్వడం కాస్త బలహీనంగా ఉంటామనే ఉద్దేశంతో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా లైట్ తీసుకుంటారు. కానీ అలా నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు పురుషులలో కంటే మహిళలకే ఎక్కువగా వస్తుంటాయి. వాటిని వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోక పోతే తీవ్ర సమస్యలుగా మారే అవకాశం ఉంది. మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఉండటం మంచిది. అది ఏ వయసు వారైనా సరే. చాలా మంది మహిళలు కొన్ని ఆరోగ్య సమస్యలను చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. కానీ ఈ ఆరోగ్య సమస్యల విషయంలో అలర్ట్ గా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. పురుషులు మహిళలు మానవ శరీర నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది. అందుకే ఆరోగ్య పరంగా ఇద్దరు విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో వివిధ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మగవారితో పోలిస్తే ఆడవారు ఒకింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని పరిశోధనల్లో వెల్లడయింది.

ముఖ్యంగా మహిళల్లో 70% ఆనారోగ్య సమస్యలు ఒత్తిడి మూలంగానే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. హార్మోనల్ ప్రభావం, సున్నిత మనస్తత్వం వివిధ రకాల బాధ్యతలు, పెరిగిన వాతావరణ మార్పులు.. మహిళలు అధిక ఒత్తిడితో సతమతం కావడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆడవారిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, బ్రెయిన్‌లో ఉండే కార్టిసాల్ స్ట్రక్చర్, న్యూరోకెమికల్, న్యూరోఎండోక్రైన్ సిస్టమ్ భిన్నంగా ఉంటాయి. అందుకే మహిళలు తొందరగా ఒత్తిడికి లోనవుతారని చెబుతుంటారు. ఇలా పెరిగిన ఒత్తిడి వారి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.


Also Read: బరువు పెరుగుతున్నామని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా ?

సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి కాలు, చేయి నొప్పి వస్తేనే మగవాళ్లు అల్లాడిపోతుంటారు. కానీ వెన్నునొప్పి, ఆస్టియో, ఆర్థరైటిస్, తలనొప్పి, మైగ్రేన్ వంటి దీర్ఘకాలిక నొప్పులు ఆడవాళ్లను అతలాకుతలం చేస్తుంటాయి. ఈ సమస్యలతో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. దీర్ఘకాలంగా కొనసాగే ఈ ప్రాబ్లమ్స్‌తో ఆడవారు వారి నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు.

లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సరైన వైద్యం పొందే వారు చాలా తక్కువ అన్ని కూడా రుజువైంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కుంగుబాటు, నిద్రలేమి, హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం మంచిది.

Tags

Related News

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Big Stories

×