BigTV English

Must Eat Fruits in Summer: సమ్మర్.. ఈ ఐదు పండ్లను కచ్చితంగా తినాల్సిందే..!

Must Eat Fruits in Summer: సమ్మర్.. ఈ ఐదు పండ్లను కచ్చితంగా తినాల్సిందే..!
Top 5 Summer Fruits
Top 5 Summer Fruits

Should Eat 5 Fruits in Summer: ఈసారి వేసవి చాలా ముందే వచ్చింది. మార్చిలోనే ఎండలు మాడు పగిలేలా భానుడి భగభగ మంటున్నాడు. మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒటిపూట బడులు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి.


నిపుణులు ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. వేసవిలో ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం కూల్‌గా ఉంచుకోవాలి. అందుకు గాను ఈ ఐదు రకాల పండ్లను తీసుకుంటే మంచిది. అవేంటో చూడండి.

పుచ్చకాయ


వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో వీటిని వదలొద్దు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరం కూల్‌గా ఉంటుంది. వేడి తాపం నుంచి ఉపశమనం ఇస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. పుచ్చకాయలో వివిధ రకాలు ఉన్నాయి. ఏది తీసుకున్న ఒకేరకమైన ప్రయోజనాలు పొందొచ్చు.

Also Read: సమ్మర్.. కూలర్ ఇలా వాడితే ఆ వ్యాధులు.!

మామిడి

మామిడికి ఫల రాజుగా గుర్తింపు ఉంది. ఇది వేసవిలో లభించే సీజనల్‌ ఫ్రూట్‌. ఇందులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే మామిడిని మితంగా తినాలి. లేదంటే వేడి చేసే ప్రమాదం ఉంది. మామిడిని జ్యాస్‌గా తీసుకోచ్చు లేదా కాయగా తినొచ్చు.

కర్బూజా

కర్బూజా వేసవిలో మాత్రమే లభిస్తుంది. ఇది సీజనల్ ఫ్రూట్.  ఈ పండులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరంలో హీట్ చేరకుండా చూస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ పండు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది.

Also Read: పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?

జామ

జామను వేసవిలో తప్పక తీసుకోవాలి. ఇందులో పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్‌లు కూడా జామ తినొచ్చు. వేసవిలో జామ ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటారు.

బొప్పాయి

బొప్పాయిని వేసవిలో తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్‌ ఏ, విటమిస్ సి ఉంటాయి. అంతేకాకుండా ఫోలియేట్, ఫైటోకెమికల్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అయితే బొప్పాయి కూడా ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటే మంచిది. అతిగా తింటే శరీరంలో హీట్ చేరుతుంది.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య అధ్యయనాల ఆధారంగా, మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం మేరకు
రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×