BigTV English
Advertisement

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Viagra Sales: ఇప్పుడు.. మేం చెప్పబోయే వార్త చూసి సిగ్గుపడకండి. ఇది ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం! మనమంతా పైకి.. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి సిగ్గుపడతాం! కానీ.. మార్కెట్‌‌లో ఏం జరుగుతుందో తెలిస్తే.. ఇదేమంత సిగ్గుపడాల్సిన విషయం కాదనే పాయింట్ అర్థమవుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఇండియాలో అన్నీ పెరుగుతున్నట్లే.. వయాగ్రా వాడకం కూడా పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు.. తమ సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేందుకు.. వయాగ్రాని వాడుతున్నారు. ఇందుకు.. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం పెరిగిన 17 శాతం వయాగ్రా సేల్సే.. బిగ్ ఎగ్జాంపుల్. ఇందుకు.. అనేక కారణాలున్నాయ్. సెక్సువల్ వెల్‌నెస్ పట్ల.. ప్రజల్లో అవగాహన పెరగడం, హెల్త్ కేర్ నిపుణుల ద్వారా.. సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి.. అందరిలోనూ నాలెడ్జ్ బాగా పెరిగింది. ముఖ్యంగా.. ఈ విషయంలో ప్రజలు తమకున్న నిరోధాలని అధిగమించి.. వారి లైంగిక జీవితాలను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నారు.


ప్రజలు.. తమ సెక్సువల్‌ లైఫ్‌ పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలియాలంటే.. వయాగ్రా సేల్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. గతేడాది దేశంలో వయాగ్రా అమ్మకాలు 456 కోట్లుగా ఉంటే.. అదిప్పుడు 15 శాతానికి పైగా పెరిగి 525 కోట్లకు చేరింది. ఇదే సమయంలో.. తడలాఫిల్ బ్రాండ్ల విక్రయాలు కూడా 19 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. 205 కోట్ల నుంచి 244 కోట్లకు చేరుకుంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా వయాగ్రా బాగా పాపులర్. మొత్తంగా.. సెక్స్ స్టిమ్యులేటర్లు, పునరుజ్జీవన శక్తుల కేటగిరీలో.. గతేడాది 829 కోట్ల అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వయాగ్రా మార్కెట్ ఇప్పుడు.. వేగంగా అభివృద్ధి చెందుతున్న సెక్టార్‌గా.. మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇందుకు.. ప్రజలు తమ సెక్సువల్ లైఫ్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపడమే కారణం. పైగా.. ఈ రంగంలో ఉన్న కంపెనీలు కూడా.. డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా.. మార్కెట్‌లోకి కొత్త కొత్త ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే.. వాటి సేల్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కేవలం.. వయాగ్రా మాత్రమే కాదు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో.. ఆయుర్వేద మందులు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు భారతీయులు.


Also Read: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

ప్రజల్లో సెక్సువల్ లైఫ్ పట్ల ఎక్కువ అవగాహన పెరగడానికి.. అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా.. వయాగ్రా వాడకం గురించి బహిరంగంగా జరుగుతున్న చర్చ కూడా ఓ కారణం. వివిధ మాధ్యమాల ద్వారా లైంగిక నిపుణులు ఇస్తున్న సలహాలు సైతం.. ప్రజల లైంగిక జీవితాల్లో నాణ్యతను పెంచుతున్నాయ్. సెక్సాలజిస్టులు అందుబాటులో ఉండటం, వారిని.. కలిసేందుకు, సెక్సువల్ లైఫ్ లో తమకున్న అనుమానాలను తీర్చుకునేందుకు.. ఏమాత్రం సిగ్గుపడకపోవడం లాంటివి కూడా వయాగ్రా సేల్స్ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మొత్తానికి.. ప్రజల తమ సెక్సువల్‌ని ఎంజాయ్ చేయడం పట్ల సీరియస్‌గానే ఉన్నారు.

వాస్తవానికి.. రోజులు మారుతున్నాయ్. జనరేషన్లు మారుతున్నాయ్. అందుకు తగ్గట్లుగానే.. పరిస్థితులతో పాటు ప్రజల జీవనశైలి, ఆలోచనా సరళి కూడా మారుతోంది. ఇప్పుడు సెక్సువల్ లైఫ్ అంటే బూతు కాదు. పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు. రీసెర్చ్ చేస్తున్నారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటున్నారు. తమ పార్ట్‌నర్‌తో వీలైనంత ఎక్కువ సేపు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నారు. దానికోసమే.. వయాగ్రాని మోతాదుకు మించకుండా వాడుతున్నారు. తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అందుకే.. వయాగ్రా సేల్స్ పెరుగుతున్నాయ్. ఇందులో.. సిగ్గుపడటానికి ఏమీ లేదు. సెక్సువల్ లైఫ్ గురించి నాలెడ్జ్ పెంచుకుంటున్నారు.. సంతోషంగా గడుపుతున్నారు.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×