E-Paper
Advertisement

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?
Advertisement

Swayambhu Movie: ఇటీవల కాలంలో మేకర్స్ ప్రేక్షకుడికి అసలైన.. మంచి వినోదాన్ని పంచే.. కంటికి విందుగా అనిపించే చిత్రాన్ని అందించడానికి ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అనుకున్న సమయానికి సినిమాను తీసుకురావడంలో కూడా విఫలమవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యేకించి కొన్ని చిత్రాలపై అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నా.. ఆ సినిమాలు మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. అలాంటి చిత్రాలలో నిఖిల్ స్వయంభు కూడా ఒకటి. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నిఖిల్ కార్తికేయ 2 చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సొంతం చేసుకున్నారు.

స్వయంభు విడుదల అయ్యేది ఎప్పుడు?

ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో 2023 ఆగస్టులోనే స్వయంభు అనే మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి మూడేళ్లు గడిచిపోయాయి కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కి నోచుకోకపోవడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని, అటు ప్రమోషన్లతో కూడా చిత్రబృందం తెగ హడావిడి చేసింది. టీవీ షోలలో పాల్గొని, పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే సినిమా చెప్పిన టైంకి రాలేదు. ఆ తర్వాత వేసవి అన్నారు.. అది కూడా జరగలేదు. తర్వాత నుంచి టీం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు నవంబర్ నెల అంటున్నారు. మరో 50 రోజులు గడిస్తే.. ఈ ఏడాది కూడా పూర్తవుతుంది.

వచ్చే ఏడాది సమ్మర్ వరకు నో గ్యాప్…

Advertisement

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వడం అసాధ్యం. ఒకవేళ వచ్చే యేడాది సంక్రాంతికి అనుకున్నా.. ఆ సమయంలో పెద్ద హీరోలను మొదలుకొని చిన్న హీరోలు కూడా తమ సినిమాలతో విడుదలకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ సినిమా వస్తుందా అంటే అసాధ్యం అని చెప్పాలి. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి ఆపై వేసవిలో కూడా బెర్త్ లు కన్ఫామ్ చేసుకున్నారు మిగతా హీరోలు. ఇక ఈ జాబితా చూశాక అసలు స్వయంభు ఎప్పుడు వస్తుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

పాన్ ఇండియా మూవీనే శాపంగా మారిందా..

ఒకప్పుడు ఆయన ప్రాంతీయంగా సినిమాలు చేస్తున్నప్పుడే అనుకున్న సమయానికి ఖచ్చితంగా తన సినిమాలను విడుదల చేసేవారు. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా గోలలో పడ్డాడో అప్పటినుండి రెగ్యులర్గా కనిపించకుండా పోయాడు. సాధారణ ప్రేక్షకులు చాలా మంది ఇతడిని మర్చిపోయారు కూడా.. పాన్ ఇండియా మూవీ ఆయన కెరియర్ కు శాపంగా మారిందా అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఇన్ని కామెంట్స్ నడుమ నిఖిల్ ఎప్పుడు తన సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించగా.. భువన్ సాగర్ నిర్మించారు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.

Advertisement

also read: ‘వృషకర్మ’ నుండి ఫస్ట్ సింగిల్.. ఎక్స్‌క్లూజివ్ గా ఆమె కోసమే!

నిఖిల్ మరో కొత్త ప్రాజెక్టు..

ఇదిలా ఉండగా మరోవైపు ఈయన రామ్ చరణ్ నిర్మాతగా ‘ది ఇండియన్ హౌస్’ అనే ఒక ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశారు . దానిపైన కూడా ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. మరి ఇన్ని గందరగోళాల మధ్య నిఖిల్ ఎప్పుడు స్పందించి క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది.

Related News

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!

Big Stories

Advertisement
×