BigTV English

Winter Face Pack: ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో మచ్చలేని చర్మం

Winter Face Pack: ఖరీదైన ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో మచ్చలేని చర్మం

Winter Face Pack: చాలా మందికి వింటర్ సీజన్ అంటే ఇష్టం. ఈ సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా ముఖ కాంతిని పూర్తిగా కోల్పోతుంది. నిజానికి చలికాలంలో చర్మం తేమ తగ్గడం మొదలవుతుంది. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం పొడిబారుతుంది.


మీరు ఫేషియల్ గ్లో మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం సహజ పదార్థాలతో తయారు చేసిన 5 ఫేస్ మాస్క్‌లను ఉపయోగించండి. ఈ ఫేస్ మాస్క్‌లు చర్మాన్ని మృదువుగా చేసి కొత్త మెరుపును అందిస్తాయి.

చాలా ఫేస్ ప్యాక్‌లు మార్కెట్‌లో సులువుగా లభిస్తాయి. మీకు కావాలంటే సహజమైన పదార్థాలతో ఇంట్లోనే ఫేస్ మాస్క్‌లను సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లు చవకగా ఉండటమే కాకుండా చర్మానికి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంటాయి. శీతాకాలంలో గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడే 5 ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మీ ముఖానికి మెరుపు తెచ్చే 5 ఫేస్ మాస్క్‌లు:

పెరుగు, పసుపు ఫేస్ మాస్క్: పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.

తయారుచేసే విధానం: 2 టీస్పూన్ల పెరుగులో 1/4 టీస్పూన్ పసుపు వేసి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్ , హనీ ఫేస్ మాస్క్: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది.
తయారుచేసే విధానం: 2 చెంచాల ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, శాండల్‌వుడ్ ఫేస్ మాస్క్: అలోవెరా చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. చందనం చర్మాన్ని టోన్ చేస్తుంది.
తయారుచేసే విధానం: 2 టీస్పూన్ల అలోవెరా జెల్‌లో 1 టీస్పూన్ గంధపు పొడిని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి, తేనె ఫేస్ మాస్క్: అరటిపండు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది.
తయారుచేసే విధానం: సగం పండిన అరటిపండును తీసుకుని మెత్తగా చేయాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శనగ పిండి, పెరుగు ఫేస్ మాస్క్: శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెరుగు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
తయారుచేసే విధానం: 2 చెంచాల పెరుగులో 2 చెంచాల శనగపిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్‌లను వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం మెరుస్తుంది.

కొన్ని అదనపు చిట్కాలు:
మీ ముఖాన్ని కడిగిన తర్వాత ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి.
నీరు పుష్కలంగా త్రాగాలి.
ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినండి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×