Sony MDR-3R retro headphones: మ్యూజిక్ లవర్స్ మళ్లీ పాత రోజులకు తీసుకెళ్లేలా టెక్ దిగ్గజం సోనీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 1979 నాటి ఐకానిక్ వాక్‌మ్యాన్ హెడ్‌ఫోన్‌లను.. పోలిన రెట్రో డిజైన్‌తో ‘సోనీ MDR-3R’ రూపంలో మళ్లీ మార్కెట్లోకి.. అడుగుపెడుతోంది. నాటి క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూ.. ప్రస్తుత కాలానికి తగినట్లుగా USB టైప్-C పోర్ట్ వంటి మోడర్న్ ఫీచర్లతో ఇది వస్తోంది. వింటేజ్ లుక్‌ను ఇష్టపడే టెక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ కొత్త హెడ్‌ఫోన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ హెడ్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దాని డిజైన్. 1979లో.. ఒరిజినల్ సోనీ వాక్‌మ్యాన్‌తో పాటు వచ్చిన ఆ చిన్న, మెటాలిక్ హెడ్‌బ్యాండ్ , ఆరెంజ్ కలర్ ఫోమ్ ఇయర్ ప్యాడ్స్ డిజైన్‌ను ఇందులో అచ్చంగా అలాగే ..తీసుకువచ్చారు. చేతిలో పట్టుకుంటే ఎంతో తేలికగా.. చూడటానికి సింపుల్‌గా ఉండే ఈ రెట్రో లుక్ ప్రస్తుత యూజర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్‌ను ఇష్టపడే.. వారికి ఇది పర్ఫెక్ట్ యాక్సెసరీగా నిలుస్తుంది.
డిజైన్ ఎంత పాతదైనా.. లోపల ఉన్న టెక్నాలజీ మాత్రం పూర్తిగా ఆధునికం. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లు , ల్యాప్‌టాప్‌లలో 3.5mm ఆడి యో జాక్ క్రమంగా కను మరుగవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో.. ఉంచుకుని సోనీ సంస్థ ఈ హెడ్‌ఫోన్‌లో సరి కొత్త USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీని అందించింది. దీని వల్ల ఎలాంటి అడాప్టర్ల అవసరం లేకుండా నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌కు కనెక్ట్ చేసి మ్యూజిక్ వినొచ్చు.
చూడటానికి చాలా చిన్నదిగా , సింపుల్‌గా అనిపించినప్పటికీ, సౌండ్ క్వాలిటీ విషయంలో.. సోనీ ఎప్పుడూ రాజీపడదు. ఈ హెడ్‌ఫోన్ ట్రెండీ డిజైన్‌తో కూడిన పవర్ ఫుల్ డ్రైవర్లను కలిగి ఉంది. పాటల్లోని బేస్ , వోకల్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా మ్యూజిక్ వినేటప్పుడు ఇది అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
రోజంతా చెవులకు పెట్టుకున్నా… ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీనిని తేలికపాటి మెటీరియల్‌తో తయారు చేసారు. ఇయర్ ప్యాడ్స్ చాలా మృదువుగా.. ఉండి చెవులపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు.. బ్యాగ్‌లో సర్దుకోవడం చాలా ఈజీ. వింటేజ్ వైబ్స్‌ను కోరుకునే కాలేజీ విద్యార్థులు , మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
సోనీ MDR-3R హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి త్వరలోనే.. అధికారికంగా విడుదల కానున్నాయి. దీని ధర మిడ్-రేంజ్ బడ్జెట్‌లో అందుబాటులో.. ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెట్రో లవర్స్, సోనీ బ్రాండ్ లవర్స్ ఈ డివైజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాత కాలపు జ్ఞాపకాలను, లేటెస్ట్ హంగులను ఒకే చోట చేర్చిన సోనీ MDR-3R హెడ్‌ఫోన్స్ టెక్ మార్కెట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించడం ఖాయం. మీరూ గనక వింటేజ్ లుక్ ఇష్టపడే వారైతే, ఈ కొత్త గాడ్జెట్‌ను మీ కలెక్షన్‌లో కచ్చితంగా చేర్చుకోవాల్సిందే!