Semiya payasam recipe: పండగ ఏదైనా, ఇంట్లో చిన్న వేడుక జరిగినా మనకు ముందుగా గుర్తుకు వచ్చే స్వీట్ ‘సేమ్యా పాయసం’. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాయసాన్ని చాలామంది తయారు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పాయసం తయారు చేసిన కొద్ది సేపటికి చిక్కబడిపోయి, గట్టిగా మారుతుంది. అలా జరగకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో, క్రీమీగా, అద్భుతమైన రుచితో సేమ్యా పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
4 నుంచి 5 గురు తినేలా సేమ్యా పాయసం చేయడానికి క్రింది కొలతలను ఖచ్చితంగా పాటించండి.
సేమ్యా: 1 కప్పు (సుమారు 100 గ్రాములు)
పాలు : 4 కప్పులు (చిక్కని పాలు లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మరింత రుచిగా ఉంటుంది)
చక్కెర : ముప్పావు కప్పు
నెయ్యి : 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు , కిస్మిస్: గుప్పెడు
యాలకుల పొడి: అర టీస్పూన్
నీళ్లు: అర కప్పు
1.ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే.. వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరో స్పూన్ నెయ్యి వేసి, మనం తీసుకున్న .. ఒక కప్పు సేమ్యాను వేయాలి. సేమ్యా మాడిపోకుండా దోరగా, లేత గోధుమ రంగులోకి.. వచ్చే వరకు మీడియం మంటపై వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో.. మంచిగా వేయించడం వల్ల పాయసం మంచి సువాసన రావడంతో పాటు, ఉడికేటప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటుంది.
2. ఇప్పుడు ఒక గిన్నెలో.. నాలుగు కప్పుల పాలకు, ముందుగా అర కప్పు నీళ్లు పోసి మరగబెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించి.. పెట్టుకున్న సేమ్యాను అందులో వేయాలి. సేమ్యా సుమారు 70 శాతం వరకు నీటిలోనే ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల సేమ్యా త్వరగా మెత్తబడుతుంది. సేమ్యా సగం ఉడికిన తర్వాత, మనం పక్కన పెట్టుకున్న నాలుగు కప్పుల కాచి చల్లార్చిన లేదా వేడి పాలను అందులో పోయాలి. పాలు పోసిన.. తర్వాత మంటను మీడియం లేదా సిమ్‌లో ఉంచి బాగా కలపాలి. పాలు, సేమ్యా రెండు కలిసి బాగా ఉడుకుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది.
3. సేమ్యా పూర్తిగా ఉడికిన తర్వాతే.. చక్కెర వేయాలి. గుర్తుంచుకోండి, సేమ్యా ఉడకకముందే చక్కెర వేస్తే అది గట్టిగా అయిపోతుంది. కాబట్టి సేమ్యా పూర్తిగా ఉడికిన తర్వాత ముప్పావు కప్పు చక్కెర వేసి కరిగే .. వరకు కలపాలి. చక్కెర కరిగిన రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా.. అర టీస్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యి జీడిపప్పు, కిస్మిస్‌లను పాయసంలో కలపాలి.
Also Read: నోరూరించే వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి అదుర్స్!
పాయసం చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉండాలంటే.. పాలు కొద్దిగా ఎక్కువగా (సేమ్యాకు 4 రెట్లు) పోయాలి.
ఒకవేళ పాయసం చల్లారిన ..తర్వాత మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా కాచి చల్లార్చిన పాలను గోరు వెచ్చగా చేసి కలుపుకోవచ్చు.
బెల్లంతో పాయసం చేసేటట్టయితే.. పాకం పద్ధతిలో కాకుండా బెల్లం కరిగించి వడకట్టి, పాయసం దించే ముందు కలుపుకోవాలి.
ఈ కొలతలతో ,చిన్న చిట్కాలను పాటిస్తూ మీరు ఇంట్లోనే అద్భుతమైన, క్రీమీగా ఉండే సేమ్యా పాయసాన్ని తయారు చేయెచ్చు. ఈ పండగ లేదా ప్రత్యేక రోజున మీ కుటుంబ సభ్యులకు ఈ పాయసం వంటకం చేసి.. పెట్టండి.