Diwali Night Owl Sighting | దీపావళి రాత్రి ఇంటి దగ్గర గుడ్లగూబ కనిపిస్తే మీరు ఏమనుకుంటారు? సాధారణంగా రాత్రిపూట కనిపించే ఈ పక్షిని ఆ సమయంలో చూడటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే హిందూ సంప్రదాయాల్లో గుడ్లగూబకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవి వాహనంగా భావించే గుడ్లగూబ దీపావళి రాత్రి కనిపిస్తే శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగి, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం.. ఈ నమ్మకానికి దీనికి 5 ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి.
దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపించడం ఆర్థికంగా మంచి రోజులు రాబోతున్నాయనేందుకు సంకేతమని శకున శాస్త్రం చెబుతోంది. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుందని కొందరు భావిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చని, పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు పూర్తికావొచ్చని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి.
దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపించడం వృత్తిపరమైన అభివృద్ధికి సంకేతం. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు, పదోన్నతులు లేదా మంచి గుర్తింపు లభించవచ్చు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు పడతాయని కొందరు విశ్వసిస్తారు.
శకున శాస్త్రంలోని వ్యాఖ్యానాల ప్రకారం.. గుడ్లగూబ కనిపించడం కష్టాలు తొలగిపోవడానికి సూచన. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో ప్రశాంతత, స్థిరత్వం తిరిగి వస్తాయి.
Also Read: నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి
హిందూ సంప్రదాయంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందుకే దీపావళి రాత్రి ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపిస్తే కొందరు శుభసూచకమని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కుటుంబంలో సంతోషం, ఆర్థిక స్థిరత్వం, సంపద పెరుగుతాయి. ఏడాది పొడవునా ఆహారానికి, అవసరాలకు లోటు ఉండదు.
గుడ్లగూబ కనిపించడం జీవితంలోని ప్రతికూల పరిస్థితులు తొలగిపోవడానికి సంకేతం. వ్యక్తిగత సమస్యలు తగ్గి, కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తారు. జీవితంలో ఆశ, ధైర్యం పెరిగి కొత్త ప్రారంభానికి మార్గం ఏర్పడుతుందని చెబుతారు.
హిందూ మత విశ్వాసాల్లో లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందుకే దీపావళి రాత్రి ఆ పక్షి దర్శనాన్ని చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇవన్నీ మతపరమైన, సాంస్కృతిక నమ్మకాలు మాత్రమే. గుడ్లగూబలు రాత్రిపూట ఆహారం కోసం సంచరించే పక్షులు. వాటిని ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతిలో వాటి పాత్రను గౌరవించాలి.