Mouli Little Hearts:‘లిటిల్ హార్ట్స్’..టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై ఏకంగా 40 కోట్ల భారీ వసూళ్ళని కొల్లగొట్టింది .దీంతో ఈ సినిమాలో నటించిన మౌళి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు.
ఇక తాజాగా దొంగ నా కొడుకు అనే మరో సినిమాతో ఈ నెల 13న రిలీజ్ అవబోతుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు .అలా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలా ‘లిటిల్ హార్ట్స్’సినిమా పారితోషికం గురించి పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు .
ఎంత రెమ్యూనరేషన్?
‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని అడగగా ఆ విషయాన్ని చర్చించడానికి తాను ఇష్టపడటం లేదని చెప్పారు. అయితే సినిమా విడుదలై సూపర్ హిట్ అయినతర్వాత నిర్మాతల నుంచి ఏమైనా గిఫ్ట్ లేదా డబ్బు వచ్చిందా అని అడగ్గా.. అలాంటిదేమీ రాలేదని తెలిపాడు. తాను కూడా ఎవరినీ ఏమీ అడగలేదని, జరిగిన దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.
కుటుంబ సభ్యులకు ఈ విజయం ఎంతో ప్రత్యేకం
ఇక ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ తన కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని , తమ బంధువుల్లో కానీ, పరిచయస్తుల్లో కానీ ఎవరూ సినిమా లేదా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ లో లేరని అన్నాడు .
అలాంటి తమ కుటుంబం నుంచి ఒకరు హీరోగా మారి, సినిమా థియేటర్లలో రిలీజ్ అయి ఇంత సక్సెస్ కావడం వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
కుటుంబాన్ని టూర్‌కు తీసుకెళ్లాలనుకున్నా..
అయితే ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ తర్వాత కుటుంబ సభ్యులను మంచి టూర్‌కు తీసుకెళ్లాలని అనుకున్నానని , అయితే ఇప్పటివరకు తీసుకెళ్లలేకపోయానని వాపోయాడు . తాను కొంతకాలంగా సంపాదించిన డబ్బును దాచుకునే అలవాటు ఉందని, కుటుంబం కోసం ఖర్చు చేయాలనుకున్నా తన తల్లి మాత్రం వద్దని చెప్పిందని తెలిపాడు.ఇప్పుడు అనవసరంగా ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేసుకోవాలని తల్లి చెప్పిందని గుర్తుచేసుకున్నాడు..
హీరో అయినా లైఫ్‌స్టైల్‌లో మార్పులేదు
అయితే సినిమా హిట్ కావడంతో హీరోగా గుర్తింపు వచ్చిందని, ఇన్కమ్ కూడా పెరిగిందని చెప్పిన మౌళి.. తన లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పాడు.
. గతంలో ఎక్కడైతే ఉండేవారో ఇప్పటికీ అక్కడే ఫ్లాట్‌మేట్స్‌తో కలిసి షేరింగ్‌లో ఉంటున్నానని ప్రస్తుతం తనకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ , పెళ్లి వంటివి లేకపోవడంతో ప్రత్యేకంగా పెద్ద ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.ఒక గది ఉంటే తనకు సరిపోతుందని, అందుకే అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడం లేదని వివరించాడు.
బ్రాండెడ్ దుస్తులు, లగ్జరీలపై ఆసక్తి
అయితే హీరోగా మారినప్పటికీ తనకు నచ్చినట్లుగానే ఉండటానికి ఇష్టపడతానని, ప్రత్యేకంగా అందంగా కనిపించాలని ఎక్కువగా ప్రయత్నించనని చెప్పాడు మౌళి . హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోనని తెలిపాడు.
.అయితే ఇప్పుడు బయటకు వెళ్లినప్పుడు అభిమానులు ఫొటోలు తీసుకుంటున్నారని, అలాంటి సమయంలో కనీసం మంచి దుస్తులు వేసుకోవాలని అనిపిస్తూ ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ‘లిటిల్ హార్ట్స్’ సినిమా అంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ తనకు పెద్దగా డబ్బు లేదా గిఫ్ట్స్ ముట్టలేదని మౌళి చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి !
ALSO READ:బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!