Pimple Marks: మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అందులో ఒకటి మొటిమల సమస్య. మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యతతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కౌమారదశ, యుక్తవయస్సులో మొటిమల సమస్య చాలా సాధారణం. కానీ పెద్దవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. ముఖంపై మచ్చలు చికాకును కలిగిస్తాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా మంది ఈ సమస్యను నయం చేయడానికి ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు కూడా మొటిమలతో ఇబ్బంది పడుతుంటే , వాటిని తొలగించడానికి సులభమైన , సురక్షితమైన హోం రెమెడీస్ వాడండి వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి ఎలాంటి హోం రెమెడీస్ మొటిమలు తగ్గడానికి ఉపయోగపడతాయి. వాటిని ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకుల పేస్ట్:
వేప చర్మంపై ఉన్న మొటిమలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వేపలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ , ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. దీనిని తయారు చేయడానికి కొన్ని తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని మొటిమలపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు క్రమం తప్పకుండా అప్లై చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
పసుపు, తేనె ఫేస్ ప్యాక్:
పసుపు , తేనె రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.అయితే తేనెలో హైడ్రేటింగ్ , యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి తేమను అందించి మంటను తగ్గిస్తాయి. మొటిమల మీద పసుపు, తేనె కలిపిన ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల చర్మానికి ఉపశమనం లభించి, మొటిమల పరిమాణం తగ్గుతుంది. దీనిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ తేనె కలిపి పేస్ట్ చేయండి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు అప్లై చేయమడం ద్వారా ముఖంమై మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
ఆహారపు అలవాట్లు:
మీ చర్మం యొక్క ఆరోగ్యం మీ శరీరం లోపలి భాగాలతో కూడా ముడిపడి ఉంటుంది. మీ ఆహారం సమతుల్యంగా లేకపోతే మొటిమల సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్, చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు చర్మానికి హానికరం. ఇవి ముఖంపై మొటిమలను కూడా కలిగిస్తాయి. అందుకే మీ ఆహారాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, ఆకు కూరలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలు మీ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: కార్న్ ఫ్లోర్‌లో ఈ ఒక్కటి కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
మొటిమల సమస్యను తొలగించడానికి, ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంటే హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. వేప, పసుపు, తేనెతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.