Rewind 2024: ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్లు, మిక్సీ్డ్ టాక్ ను అందుకున్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే హిట్టు, యావరేజ్. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి.. అలాగే యావరేజ్ టాక్ ను అందుకున్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఈ ఏడాదిలో భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నాయి. 2024లో మిశ్రమ ఫలితాలను ఫలితాలను అందుకున్న ఆ హీరోలెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి కల్ట్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ ను ఎనర్జిటిక్ గా ప్రజెంట్ చేసినప్పటికీ, అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనల్ రన్ లో 185 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు..
కల్కి..
టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి.. భారీ బడ్జెట్ తో స్టార్ కాస్టింగ్ తో తీసిన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్లు వచ్చాయి. క్రిటిక్స్ రివ్యూలు కూడా దీనికి తగ్గట్టుగానే వెలువడ్డాయి. టాక్ సంగతి పక్కనపెడితే కలెక్షన్స్ మాత్రం 1100 కోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే వంటి స్టార్స్ నటించారు.
దేవర..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ దేవర.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో అందుకుంది..
పుష్ప 2..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తీసిన సినిమా పుష్ప 2: ది రూల్. ఇది ‘పుష్ప: ది రైజ్’ మూవీకి సీక్వెల్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి ఊహించినంత వైల్డ్ ఫైర్ లేదని కొందరు ఫిలిం క్రిటిక్స్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి పోస్టులే కనిపించాయి. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అత్యంత వేగంగా 1700 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఈ మూవీస్ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి..