Mohammed Siraj: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా జట్టు ఆశించినంతమేర రాణించలేకపోతోంది. అయితే భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యమే జట్టు పేలవ ప్రదర్శనకు కారణం అనడంలో సందేహం లేదు. మరోవైపు జట్టులో సీనియర్ పేస్ బౌలర్ లేకపోవడం జట్టును తొలి టెస్ట్ నుంచే ఇబ్బంది పెడుతుంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా మినహా మిగిలిన బౌలర్ల నుండి నిలకడగా ప్రదర్శన లేదు. బూమ్రాతో పాటు సిరాజ్ {Mohammed Siraj} కూడా జట్టులో మరొక పేసర్.
Also Read: Indian players: బాక్సింగ్ డే టెస్ట్ లో నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు
కానీ సిరాజ్ అవసరమైన సందర్భంలో వికెట్లు తీయకపోవడంతో జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుంది. మహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ {Mohammed Siraj} సరైన సమయంలో వికెట్లు పడగొట్ట లేకపోవడంతో ఆ భారం అంతా బూమ్రాపై పడి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ పై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కూడా సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు.
23 ఓవర్లు బౌలింగ్ చేసి {Mohammed Siraj} ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. 5.30 ఎకానమీతో ఏకంగా 122 పరుగులు సమర్పించాడు. సిరాజ్ టెస్ట్ కెరీర్ లోనే ఇది అత్యంత చెత్త రికార్డు. దీంతో సిరాజ్ పై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రీడాభిమానులు. రిటైర్మెంట్ ప్రకటించి హైదరాబాద్ కి వచ్చేయాలని సూచిస్తున్నారు. సిరాజ్ కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్పీ ఉద్యోగం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని, వెంటనే {Mohammed Siraj} డిఎస్పీగా చార్జ్ తీసుకొని ఆ కేసును టెక్ ఓవర్ చేయాలని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మరి రెండవ ఇన్నింగ్స్ లోనైనా రాణించి భారత జట్టు గెలుపుకి కారణం అవుతాడా..? లేక మరోసారి నెటిజెన్ల ట్రోలింగ్ కి గురవుతాడా..? అన్నది వేచి చూడాలి. ఇక మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు మళ్లీ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?
ఈసారి ఓపెనర్ గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఓవర్ లో పాట్ కామీన్స్ వేసిన బంతికి బోలాండ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హిట్ మ్యాన్ మరోసారి నిరాశపరిచాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నారు.