E-Paper
Advertisement

సామాన్యుడికి అంతుచిక్కని..శివుడి 5 అద్భుతమైన రహస్య శక్తులు ఇవే!

సామాన్యుడికి అంతుచిక్కని..శివుడి 5 అద్భుతమైన రహస్య శక్తులు ఇవే!
Advertisement

Hidden powers of Lord Shiva: సనాతన ధర్మంలో శివుడిని అత్యంత శక్తివంతమైన దైవంగా కొలుస్తారు. అందరూ ఆయనను ప్రశాంతంగా కూర్చునే యోగిగా లేదా వినాశకుడిగా మాత్రమే చూస్తుంటారు. కానీ అంతకు మించి ఆయన తత్వంలో ఎన్నో లోతైన జీవిత సత్యాలు దాగి ఉన్నాయి. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే కొన్ని అద్భుతమైన శక్తులు ఆయన రూపంలో, జీవితంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భ్రాంతిని దహించివేసే మూడో కన్ను:

శివుడి మూడో కన్ను అనగానే కేవలం కోపం లేదా క్షణాల్లో ఏదైనా నాశనం చేయడం అని చాలా మంది పొరపడుతుంటారు. కానీ అది అజ్ఞానాన్ని, అహంకారాన్ని, తప్పుడు నమ్మకాలను దహించి వేసే నిజమైన స్పష్టత. మన జీవితంలో అనియంత్రిత కోరికలు , ఆశలు మన లక్ష్యం నుంచి మనల్ని పక్కదారి పట్టిస్తాయి. ఎప్పుడైతే.. మనలో అంతర్గత స్పష్టత ఏర్పడుతుందో.. అప్పుడే వాస్తవికత ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ శక్తి మనకు నేర్పే పాఠం ఒక్కటే – గుడ్డిగా స్పందించడం కాదు, ప్రతి విషయాన్ని స్పష్టంగా చూసే బలమే అసలైన శక్తి.

2.సృష్టి,లయల నాట్యం – మార్పును స్వీకరించడం:

Advertisement

శివుడి తాండవం లేదా నృత్యం కేవలం విధ్వంసానికి సంబంధించినది కాదు, అది జీవితపు లయను సూచిస్తుంది. ప్రతి ముగింపు వెనక ఒక కొత్త ఆరంభం ఉంటుంది. జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. మనం దాన్ని ఎంత త్వరగా స్వీకరిస్తే అంత మంచిది. గతాన్ని.. పట్టుకుని వేలాడడం వల్ల మనకే నష్టం తప్ప లాభం లేదు. మార్పును అంగీకరించి ముందుకు వెళ్లినప్పుడే.. అసలైన ఎదుగుదల సాధ్యమవుతుంది.

3. విషాన్ని దిగమింగే మానసిక స్థైర్యం:

సముద్ర మథన సమయంలో.. భయంకరమైన హాలాహలం పుట్టినప్పుడు ఎవరూ దానిని ఎదుర్కొనే సాహసం చేయలేదు. కానీ శివుడు ఎలాంటి భయం లేకుండా ఆ విషాన్ని తన గొంతులోనే ఆపుకున్నాడు. ఇది కేవలం త్యాగానికి సంబంధించినది కాదు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే గొప్ప మానసిక బలానికి నిదర్శనం. మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు, వ్యతిరేకత వస్తుంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం కాకుండా.. ఆ కష్టాలను తట్టుకుని ప్రశాంతంగా ఉండటమే నిజమైన బలం.

4. కాలాన్ని జయించిన మహాసమయం:

Advertisement

శివుడు కాలానికి అతీతుడు. కాలం ఆయన నియంత్రణలో ఉంటుందే తప్ప,ఆయన కాలానికి బందీ కాడు. చాలా మంది గత కాలపు జ్ఞాపకాల తాలుకు బాధల్లోనో, భవిష్యత్తు గురించిన ఆందోళనల్లోనో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ వర్తమాన క్షణంలో పూర్తి స్పృహతో బతకడమే అసలైన స్వేచ్ఛ. కాలంపై పట్టు సాధించినప్పుడే జీవితం మన అడుగులకు మడుగులొత్తుతుంది.

Also Read: చాణక్య నీతి.. వైవాహిక జీవితం సుఖంగా కలకాలం సాగాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి

5. సమస్తాన్ని జయించే నిశ్శబ్దం:

శివుడి ధ్యానం , మౌనమే ఆయనకు అతిపెద్ద బలం. ప్రపంచం ఎంత కోలాహలంగా ఉన్నప్పటికీ, సంపూర్ణ నిశ్శబ్దంలోనే సమస్త సత్యాలు దాగి ఉంటాయి.మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా.. మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే అత్యున్నత విజయం.

ఈ ఐదు శక్తులు కేవలం పౌరాణిక కథలు కావు, మన దైనందిన జీవితానికి ఇవి అద్భుతమైన మార్గదర్శకాలు. విజయం బాహ్య ప్రపంచంలో వెతికితే దొరకదు, అది మన అంతరాత్మలోనే ఉంటుంది. నిజమైన బలం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలోనే ఉంది. శివుడిలో ఉన్న ఆ శక్తి మీ అందరిలోనూ ఉంటుంది.దానిని మేల్కొలపండి, అజేయంగా ముందుకు సాగండి!

Related News

జిమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారా? మహిళలు తప్పనిసరిగా ఈ 5 జాగ్రత్తలు పాటించాలి

చికెన్, గుడ్లు అక్కర్లేదు.. ఈ 5 హోమ్‌మేడ్ కాంబోలతో ఒక పూటకి 50g ప్రోటీన్ పొందొచ్చు!

చలికాలంలో ఫౌండేషన్ వేసినా ప్యాచీగా కనిపిస్తోందా? మేకప్‌కు ముందు ఈ టిప్స్ పాటించండి

జీతం రూ.85 వేలు, SIP పెట్టుబడి రూ.35 వేలు.. బ్యాలెన్స్ రూ.3200 మాత్రమే.. యువ ఇన్వెస్టర్‌లు చేసే తప్పులివే

వాస్తు శాస్త్రం.. ధనత్రయోదశి రోజున ఈ 5 వస్తువులు కొనడం శుభప్రదం..

దీపావళికి మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

Big Stories

Advertisement
×