E-Paper
Advertisement

వాస్తు శాస్త్రం.. ధనత్రయోదశి రోజున ఈ 5 వస్తువులు కొనడం శుభప్రదం..

వాస్తు శాస్త్రం.. ధనత్రయోదశి రోజున ఈ 5 వస్తువులు కొనడం శుభప్రదం..
Advertisement

Dhanteras shopping Auspicious Things| దీపావళి పండుగ సందడి ధనత్రయోదశి (ధన్తేరస్‌)తోనే మొదలవుతుంది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే మార్కెట్లలో కొనుగోళ్ల సందడి కనిపిస్తుంది. అయితే, బంగారం, వెండితో పాటు కొన్ని సాధారణ వస్తువులను కొనడం కూడా శుభప్రదమని వాస్తు చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ 5 వస్తువులు ఇంట్లో సానుకూలత, శుభం, సంతోషానికి చిహ్నాలుగా. ఈ ధన్తేరస్‌కు మీరు కూడా షాపింగ్ ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ వస్తువుల గురించి తెలుసుకోండి.

ధన్తేరస్ రోజున బంగారం, వెండి కొనడం శుభప్రదం

ధన్తేరస్ రోజున బంగారం, వెండి కొనడం చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. బంగారం.. సంపద, అభివృద్ధికి చిహ్నం. వెండి.. స్వచ్ఛత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావిస్తారు. మీ బడ్జెట్‌ను బట్టి బంగారం లేదా వెండి నాణెం కొనుగోలు చేయండి. చిన్న విగ్రహం లేదా ఆభరణాన్ని కూడా తీసుకోవచ్చు.

ఇత్తడి లేదా రాగి పాత్రలు

Advertisement

ధన్తేరస్ రోజున కొత్త పాత్రలు కొనడం మరో ముఖ్యమైన సంప్రదాయం. చాలామంది ఈ రోజున ఇత్తడి, రాగి లేదా స్టీల్ పాత్రలు కొనుగోలు చేస్తారు. కొత్త లోహపు పాత్రలు ఇంట్లో శుభం, సానుకూలతను తీసుకొస్తాయని శాస్త్రం చెబుతోంది. మీ అవసరాన్ని బట్టి గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు లేదా వంట పాత్రలు కొనవచ్చు.

కొత్త చీపురు కొనడం మర్చిపోవద్దు

చీపురు సాధారణంగా కనిపించే వస్తువే అయినప్పటికీ, వాస్తు ప్రకారం.. దీనికి ప్రత్యేక స్థానం ఉంది. చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు దరిద్రాన్ని తొలగించడానికి ప్రతీకగా భావిస్తారు. శుభ్రమైన ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని చాలామంది నమ్ముతారు. కొత్త చీపురు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సరైన ప్రదేశంలో ఉంచండి. ఎవరూ దానిపై కాలు వేయకుండా జాగ్రత్తపడండి.

ధన్తేరస్ రోజున ధనియాలు కొనడం శుభం

Advertisement

ధన్తేరస్ రోజున సంపూర్ణ ధనియాలు కొనడం కూడా మంచిదని నమ్మకం. పూజ సమయంలో ధనియాలు ఉంచుతారు. వాస్తు ప్రకారం, ఇవి సంపద, సిరిసంపదలకు ప్రతీకలు. పూజ తర్వాత వాటిని ప్రసాదంగా ఉపయోగించవచ్చు. అందుకే మీ షాపింగ్ జాబితాలో కొన్ని ధనియాలు కూడా ఉంటే మంచిది.

Also Read: ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

మట్టి దీపాలు

ధన్తేరస్ రోజున మట్టి ప్రమిదలు (దీపాల) కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీపాలు వెలుగు, ఆశ, సానుకూలతకు చిహ్నాలు. దీపావళి సమయంలో ఇంటిని దీపాలతో అలంకరించడం ఆనందాన్ని పెంచుతుంది. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపాలు ప్రతీకగా నిలుస్తాయి. పూజ గది, ఇంటి అలంకరణ కోసం మీకు నచ్చిన మట్టి దీపాలను కొనుగోలు చేయవచ్చు.

Also Read: చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

మీ బడ్జెట్‌కు అనుగుణంగా ధన్తేరస్ షాపింగ్‌ ప్లాన్ చేసుకోండి

ధన్తేరస్.. సంపద, శుభారంభాలకు సంబంధించిన పండుగ. అయితే, మీ అవసరాలు, ఆర్థిక స్థితిని బట్టి కొనుగోళ్లు చేయండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. పండుగను ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోండి.

Related News

దీపావళికి మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

దీపావళికి స్వీట్స్ కొంటున్నారా? కల్తీ మిఠాయిలతో జాగ్రత్త.. ఇలా చెక్ చేసి తెలుసుకోండి

పాలు, గుడ్లు ఉంటే చాలు.. 10 నిమిషాల్లో యమ్మీ యమ్మీ క్యారమెల్ కస్టర్డ్ రెడీ!

పావురాల బెడద ఎక్కువైందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. దెబ్బకి భయంతో పారిపోతాయ్!

బయట కరకరలాడుతూ.. లోపల టేస్టీ స్టఫింగ్‌తో వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్.. ఇలా చేస్తే సూపర్!

రెస్టారెంట్ స్టైల్ హనీ చిల్లీ పొటాటో సీక్రెట్ రెసిపీ.. ఈ ఒక్క చిట్కా తెలిస్తే చాలు!

Big Stories

Advertisement
×