E-Paper
Advertisement

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!
Advertisement

Virender Sehwag On Shahid Afridi:  టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఆదివారాల్లో మ్యాచ్ లు వస్తే, టీవీలకే అతుక్కుపోతుంటారు. ఒకప్పుడు రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లో కూడా టీమిండియా ప్లేయర్లు పర్యటించేవారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్లేయర్లతో మనోళ్లు డ్రెస్సింగ్ రూం కూడా పంచుకునేవారు. విందు, వినోదాలు అంటూ చిల్ అయ్యేవారు. ఈ క్రమంలోనే 2004 సమయంలో టీమిండియా ప్లేయర్లందరినీ తన ఇంటికి డిన్నర్ కు షాహిద్ అఫ్రిది పిలిచాడట.

అందరికీ సరిపడా చికెన్, మటన్, బీఫ్ వండించాడట. అయితే ఈ విందు వెళ్లిన క్రికెటర్లు అందరూ శాకాహారులేనని స్పష్టం చేసి, ఆ మాంసం నువ్వే తిను అంటూ షాహిద్ అఫ్రిదిని బండ బూతులు తిట్టినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. మాకు బీఫ్ పెడతావా ? అంటూ అందరం అతడిపై సీరియస్ అయినట్టు వివరించాడు. దీంతో అతడు వెంటనే క్షమాపణలు చెప్పి, మళ్లీ కూరగాయలతో వంటలు చేయించాడని గుర్తు చేశాడు. ఓ రెండు గంటల పాటు కష్టపడ్డ షాహిద్ అఫ్రిది.. తమకు కమ్మని భోజనం పెట్టాడని తెలిపాడు. దీంతో టీమిండియా క్రికెటర్లు అందరూ కూల్ అయినట్టు క్లారిటీ ఇచ్చాడు.

డ్రెస్సింగ్ రూంలో పాక్ ప్లేయర్లతో సరదాగా ఉండేవాళ్లం

Advertisement

భారత్, పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలున్నా, అప్పట్లో పాక్ జట్టు ప్లేయర్లతో తాము సరదగా ఉండేవాళ్లమన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. తమ రూంలోకి పాక్ ప్లేయర్లు, వాళ్ల రూముల్లోకి మేం వెళ్లేమని చెప్పాడు. అప్పట్లో కూడా మైదానంలో రెండు జట్ల ప్లేయర్ల మధ్య చాలా గొడవలు జరిగాయని, కానీ డ్రెస్సింగ్ రూంలో మాత్రం కలిసి కట్టుగా ఉండేవాళ్లమని వెల్లడించాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా చెడిపోయిందని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు తమ కోసం మాంసం ఇంటి నుంచి తీసుకొచ్చేవాళ్లని గుర్తు చేశాడు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Advertisement

30 మంది తినే బిర్యానీ, మాంసాన్ని షోయబ్ అక్తర్ తీసుకొచ్చేవాడని, అంత మొత్తంలో భోజనం తినేవవాళ్లం కాదన్నాడు. దీంతో పాక్ ప్లేయర్లు కూడా ఆ భోజనాన్ని షేర్ చేసుకునేవాళ్లని చెప్పాడు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా, 2003-04 సమయంలో పాకిస్తాన్ టూర్ కు వెళ్లిన టీమిండియా.. టెస్టుతో పాటు వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆ సమయంలోనే జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

 

 

Related News

జాన్ సెనాను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ ర్యాంగింగ్…భారీ వ‌ర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌

కివీస్ బ్యాట‌ర్ టిక్‌నెర్ ను చీటింగ్ చేసిన గుర్నూర్…ద‌మ్ముంటే సిక్స‌ర్ కొట్టాలంటూ రెచ్చ‌గొట్టి మ‌రీ!

రోహిత్ శ‌ర్మ సూప‌ర్ డైవ్, గాల్లో పక్షిలా ఎగిరిన‌ కోహ్లీ…న్యూజిలాండ్ కు సినిమా చూపిస్తున్నారుగా

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

Big Stories

Advertisement
×