E-Paper
Advertisement

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!
Advertisement

Bus Conductor: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం కొద్దిపాటి చిల్లర విషయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఒక మహిళా కండక్టర్ దారుణ మరణానికి దారితీసింది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిని ప్రయాణికురాలు రోడ్డుపైకి నెట్టివేసిన ఘటన డిపో వర్గాల్లోనే కాక, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అసలు ఏం జరిగింది?

Advertisement

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన గుండ్ల ప్రవళిక మహిళా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ తన కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కింది. బాబు టికెట్ కోసం రూ.100 ఇవ్వగా, కండక్టర్ ప్రవళిక రూ.10 టికెట్ ఇచ్చి, మిగతా రూ.90 చిల్లరను టికెట్ వెనుక రాసి తర్వాత ఇస్తానని చెప్పారు. అయితే తనకు చిల్లర ఇప్పుడే కావాలంటూ మౌనిక తీవ్ర ఆగ్రహంతో కండక్టర్‌తో గొడవకు దిగింది. ఆవేశంతో ప్రవళికను రన్నింగ్ బస్సు నుంచి కిందకు నెట్టేసింది.

చికిత్స పొందుతూ కండక్టర్ కన్నుమూత

Advertisement

బస్సు నుంచి కిందపడటంతో వెనుక టైర్లు ప్రవళిక కాళ్లపై నుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రవళిక శ్వాస విడిచారు. కండక్టర్ మృతికి కారణమైన నిందితురాలు మౌనికపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు.

సీఎం రేవంత్, మంత్రి పొన్నం తీవ్ర విచారం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఒక ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ సిబ్బంది పొరపాటు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని, అంతేకానీ ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.

Also Read: కేటీఆర్ నోటిని ఫినాయిల్‌తో కడగాలి.. అధికారం పోగానే గజ్జె గుర్తుకొచ్చిందా?– మెట్టు సాయికుమార్

Tags

Related News

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ చదువుతున్న యువతి వెలుగులోకి షాకింగ్ విషయాలు,

కేటీఆర్ నోటిని ఫినాయిల్‌తో కడగాలి.. అధికారం పోగానే గజ్జె గుర్తుకొచ్చిందా?– మెట్టు సాయికుమార్

గండిపేట కాండ్యూట్‌కు స్పీడ్ రిపేర్లు.. నీటి సరఫరాపై జలమండలి కీలక ఆదేశాలు!

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కవిత కీలక వ్యాఖ్యలు.. మరోసారి గుట్టు బయటకు

హైదరాబాద్‌లో హైడ్రా మెరుపు దాడులు.. రెండు పార్కులు స్వాధీనం.. తెల్లాపూర్‌లో అక్రమ బోర్ల తొలగింపు!

700 కోట్ల బడ్జెట్.. 14 లక్షల మంది మహిళలకు ఉపాధి.. రేవంత్ సర్కార్ యూనిఫామ్ విప్లవం!

క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఇక హైదరాబాద్ రానక్కర్లేదు.. జిల్లాల్లోనే ఉచిత కీమోథెరపీ!

Big Stories

Advertisement
×