E-Paper
Advertisement

దీపావళికి మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

దీపావళికి మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Advertisement

Bringing your date home this Diwali| దీపావళి వచ్చిందంటే ఇళ్లలో పండుగ సందడి మొదలవుతుంది. కొత్త బట్టలు, స్వీట్లు, పూజలు, బంధువుల రాకతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అయితే ప్రేమలో ఉన్న యువతకు మాత్రం దీపావళి మరో పెద్ద టెన్షన్ తీసుకొస్తుంది. ఇన్నాళ్లూ స్నేహితులుగా చెప్పుకున్న వ్యక్తిని ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌గా కుటుంబానికి పరిచయం చేయాలా? అనే సందేహం మొదలవుతుంది. ఎందుకంటే భారతదేశంలో లవర్‌ను ఇంటికి తీసుకెళ్లడం అంటే కేవలం పరిచయం చేయడం మాత్రమే కాదు. పెళ్లి ఎప్పుడు? ఏం చేస్తారు? కుటుంబం ఎలాంటిది? అంటూ బంధువుల నుంచి ప్రశ్నలు మొదలవుతాయి. అందుకే జెన్ Z యువత తమ కాబోయే భాగస్వామిని కుటుంబానికి పరిచయం చేసే ముందు చాలాసార్లు ఆలోచిస్తున్నారు. అసలు ఈ పరిచయం ఎందుకంత పెద్ద విషయంగా మారింది? ఎప్పుడు లవర్‌ను ఇంటికి తీసుకెళ్లాలి? తెలుసుకుందాం.

ఇండియాలో లవర్‌ను కుటుంబానికి పరిచయం చేయడం ఎందుకంత ప్రత్యేకం?

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తమ లవర్‌ని కుటుంబానికి పరిచయం చేయడం సాధారణ విషయంగా ఉంటుంది. క్రిస్మస్, థాంక్స్ గివింగ్ లేదా సాధారణ వీకెండ్స్ కూడా భాగస్వాములను తీసుకెళ్తుంటారు. అలాంటి పరిచయాలను పెళ్లికి సంకేతంగా అందరూ భావించరు. కానీ భారతీయ కుటుంబాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల్లో బంధువులందరూ ఒకచోట చేరుతారు. అప్పుడు భాగస్వామిని పరిచయం చేస్తే పెళ్లి గురించి ప్రశ్నలు మొదలవుతాయి.

జెన్ Z యువతకు ఈ విషయలో ఎందుకు భయం?

Advertisement

27 ఏళ్ల దివ్యాంశి శర్మ విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి డేటింగ్ కల్చర్‌ని గమనించారు. విదేశాల్లో తమ లవర్స్‌ని ఇంటికి తీసుకెళ్లడం సీరియస్ అంశంగా భావించరని ఆమె చెప్పారు. కానీ ఇండియాలో దీపావళి లాంటి పండుగలకు కూడా స్నేహితులను ఇంటికి పిలవడానికి కూడా ఆలోచించాల్సి వస్తుందని అన్నారు.
తన బాయ్‌ఫ్రెండ్‌ ఇంటికి తీసుకెళ్లినా ముందుగా స్నేహితుడిగానే పరిచయం చేస్తానని ఆమె అంటున్నారు. ఎందుకంటే ఒక్క పరిచయంతోనే వంద ప్రశ్నలు మొదలవుతాయని ఆమె అభిప్రాయం.
23 ఏళ్ల దక్ష్ అరోరాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉన్న తన ప్రేయసిని దీపావళికి ఇంటికి తీసుకెళ్లడం తనకు అంత ఈజీ కాదని చెప్పారు. తల్లిదండ్రులు స్వాగతించినా, బంధువులు పెళ్లి ఎప్పుడు అని అడుగుతారని ఆయన భయపడుతున్నట్లు వెల్లడించారు.

లవర్‌ను కుటుంబానికి పరిచయం చేయాలంటే మానసిక ఒత్తిడి

నోయిడాకు చెందిన సైకాలజిస్ట్ ఆయుషి మెహ్రా ప్రకారం, భాగస్వామిని కుటుంబానికి పరిచయం చేయడం వ్యక్తిగత సంబంధాన్ని అందరి ముందుకు తీసుకెళ్తుంది. కుటుంబ సభ్యులు తమ బంధాన్ని పరిశీలిస్తారనే ఆందోళన యువతలో ఉండవచ్చు. సంబంధం ఎంతకాలంగా కొనసాగుతుందనేది ముఖ్యం కాదు. భాగస్వామిని అందరి ముందు అంగీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉన్నారా అనేదే ముఖ్యమని ఆమె వివరిస్తున్నారు.

Advertisement

Also Read: దీపావళికి ఇల్లంతా మెరిసిపోవాలా? ఇదిగో తక్కువ శ్రమతో ఈ హోమ్ క్లీనింగ్ టిప్స్

దీపావళికి ముందే లవర్‌ను ఇంటికి తీసుకెళ్లాలా?

దీనికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదు. ముందుగా భాగస్వామితో మాట్లాడి పరిచయం గురించి ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. పెళ్లి గురించి వచ్చే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో కూడా చర్చించుకోవాలి. మొదట చిన్న కుటుంబ సమావేశంలో పరిచయం చేయడం మంచిది. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది.

Also Read: ఇండియాలో పర్యటించే విదేశీయులకు ఈ 5 ప్రదేశాల్లో అనుమతి లేదు.. కారణాలు ఇవే

పండుగల సమయంలో జెన్ Z డేటింగ్ ట్రెండ్

టిండర్ సర్వే ప్రకారం.. భారత్‌లో 43 శాతం జెన్ Z యువత ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను తొలి డేట్‌కు ఇష్టపడుతున్నారు. దాదాపు 30 శాతం మంది ఇలాంటి సందర్భాల్లో భాగస్వాముల కోసం చూస్తున్నారు. 2026 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 53 శాతం మంది పండుగల సమయంలో తమ రిలేషన్‌షిప్‌ను బయటపెట్టేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు, 31 శాతం మంది ఒంటరిగా ఉన్నారనే ప్రశ్నలు తప్పించుకోవడానికి స్నేహితులను ఫెస్టివ్ ప్లస్ వన్‌గా తీసుకెళ్లారు.

చివరిగా చెప్పాలంటే, లవర్‌ను కుటుంబానికి పరిచయం చేయడం కంటే ఆ బంధాన్ని అందరి ముందు అంగీకరించడానికి సిద్ధంగా ఉండటమే నిజమైన రిలేషన్‌షిప్ మైలురాయి.

Related News

మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

దీపావళికి స్వీట్స్ కొంటున్నారా? కల్తీ మిఠాయిలతో జాగ్రత్త.. ఇలా చెక్ చేసి తెలుసుకోండి

పాలు, గుడ్లు ఉంటే చాలు.. 10 నిమిషాల్లో యమ్మీ యమ్మీ క్యారమెల్ కస్టర్డ్ రెడీ!

పావురాల బెడద ఎక్కువైందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. దెబ్బకి భయంతో పారిపోతాయ్!

బయట కరకరలాడుతూ.. లోపల టేస్టీ స్టఫింగ్‌తో వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్.. ఇలా చేస్తే సూపర్!

రెస్టారెంట్ స్టైల్ హనీ చిల్లీ పొటాటో సీక్రెట్ రెసిపీ.. ఈ ఒక్క చిట్కా తెలిస్తే చాలు!

అన్‌హెల్దీ అని తినడం మానేశారా? నిజానికి ఈ 5 ఫుడ్స్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!

Big Stories

Advertisement
×