Bigg Boss 10 Ram Prasad:జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన కామెడీ టైమింగ్ తో తన స్నేహితులు సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీనులతో కలిసి చేసిన ఎన్నో స్కిట్స్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం జబర్దస్త్ లో సుధీర్, శ్రీను వెళ్ళిపోయినప్పటికీ.. రాంప్రసాద్ మాత్రం అక్కడే స్కిట్లు చేస్తూ అందరిని నవ్విస్తూ.. బిజీగా మారిన విషయం తెలిసిందే. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ పలుషోలలో సందడి చేస్తున్న ఈయన ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ తనదైన ఆట మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే తాజాగా ఫ్యామిలీ ఫోటోలను హౌస్ లోకి పంపించి.. వారితో ఉన్న రిలేషన్షిప్ గురించి చర్చించుకోవాలని బిగ్ బాస్ చెప్పగా.. కంటెస్టెంట్స్ ఒకరికొకరు తమ ఎమోషనల్ జర్నీలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి అందరిని ఏడిపించారు. రాంప్రసాద్ మాట్లాడుతూ..”నాది హ్యాపీ ఫ్యామిలీ.. మాది వైజాగ్. బోలరాసి పార్వతమ్మ ఫ్యామిలీ అంటే మంచి పేరు. మా నాన్న వాళ్లు ఆరు మంది అన్నదమ్ములు.. ఇద్దరు చెల్లెలు.. మొత్తం ఎనిమిది మంది. అంతా ఒకే వీధిలోనే ఉంటాము. 80 మంది ఉండేవాళ్ళం. పొరపాటున ఒక్కరి బర్తడే జరిగినా సరే ఆ 80 మంది ఒకే ఇంటికి వెళ్తాము. ఆ ఖర్చు భరించలేక బర్తడేలు చేయడం కూడా మానేశాము
నేను చదువులో బాగా వీక్. అందుకే పదవ తరగతి వరకు చదివాను. ఇక ఇంటర్ జాయిన్ అవ్వగానే.. తెలుగు మినహా అన్ని ఫెయిల్ అవ్వడంతో మా నాన్నకు డబ్బులు వృధా చేయకండి అంటే నన్ను చదివించకండి అని చెప్పాను. దాంతో మెడికల్ షాప్ లో రూ.500 జీతంతో ఐదు సంవత్సరాలు పనిచేశాను . ఇక చివరి ఆఖరిలో నాకు 1500 ఇచ్చారు. మనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు.. మన జీవితాన్ని నాశనం చేసేది కూడా వారే. ఇక వాళ్లే నన్ను ఇండస్ట్రీలోకి రమ్మని ప్రోత్సహించారు. అయితే తెరమీద కాదు తెర వెనుక ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మల్టీమీడియా కోర్స్ పూర్తిచేసి ఇండస్ట్రీలోకి వచ్చాను.
అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే.. నేను, నా భార్య మూడవ క్లాస్ నుండే స్నేహితులం.. మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నాము. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో ఇండస్ట్రీని వదిలేస్తేనే అమ్మాయిని ఇస్తామన్నారు. ఇండస్ట్రీ వదిలేసి మెడికల్ లో నాకు అనుభవం ఉండడంతో మా మామయ్య నాకు డబ్బు ఇచ్చి బిజినెస్ పెట్టించాడు. అక్కడ నేను సక్సెస్ అయ్యాను. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో కొడుకు పుట్టాడు. అయితే వాడు పుట్టిన పది రోజులకే బ్రతకడు అని చెప్పారు. హైదరాబాద్ కి వెళ్ళమన్నారు. ఇక వైజాగ్ నుండి హైదరాబాద్ కి వెళ్ళాము .10 రోజుల బాబును ఒక గ్లాసులో పెట్టి మిషన్తో వాడి గుండెకు సూదులు పంపించేవాళ్లు. చాలా నరకం అనుభవించాము. అలా నెలరోజులు హాస్పిటల్ లోనే గడిచింది. ముంబై నుండి ఏదో మెడిసిన్ తీసుకురావడం వల్ల వాడు బతికేశాడు. నా కొడుకు ఒక మృత్యుంజయుడు అంటూ కొడుకు ప్రాణాపాయం నుండి బయట పడ్డ సిచువేషన్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ALSO READ:నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!
వాడు ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు అని సంతోషపడి ఇంటికి వచ్చేలోపే మా ఆవిడకు ఆరోగ్యం పాడైంది. ఆమెకి నిమోనియా వచ్చి, వెంటిలేటర్ పైన పెట్టేశారు. ఇక 24 గంటలు దాటితే తప్ప ఏం చెప్పలేమన్నారు. ఏంట్రా నా బ్రతుకు ఇలా అయింది అని కన్నీళ్లు పెట్టుకోని రోజు లేదు. ఇక తర్వాత నా భార్య దేవుడి దయతో బయటపడింది. ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోయినా మా మామయ్య, నా భార్యను ఒప్పించుకొని మరి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అందర్నీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో కూడా ఇంత ఏడిపించే స్టోరీ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.