veg sandwich: ఉదయం లేచింది మొదలు వంటగదిలో.. గంటల తరబడి గడపడం చాలా మందికి పెద్ద కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, వర్కింగ్ ఉమెన్స్ , కాలేజీ స్టూడెంట్స్ ఉదయం పూట హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి బిజీ షెడ్యూల్‌లోనూ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తూ..కేవలం 5 నిమిషాల్లో నోరూరించే వేడివేడి వెజ్ శాండ్విచ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ (బ్రౌన్ లేదా వైట్ బ్రెడ్) 4
మీడియం సైజ్ టమాటా – 1
దోసకాయ-1 (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయ-1 (సన్నని ముక్కలు)
చీజ్ స్లైసెస్ లేదా తురుము – తగినంత
గ్రీన్ చట్నీ లేదా టమాటా కెచప్ – 2 స్పూన్లు
వెన్న (బటర్) లేదా నెయ్యి – 2 స్పూన్లు
చాట్ మసాలా లేదా బ్లాక్ పెప్పర్ పౌడర్ – చిటికెడు
ఉప్పు -రుచికి సరిపడా
1.మొదటగా రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని.. వాటిపై కొద్దిగా గ్రీన్ చట్నీ లేదా టమాటా కెచప్‌ను సమానంగా రాయాలి.చట్నీ రాస్తే శాండ్విచ్‌కు మంచి స్పైసీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ బ్రెడ్ పై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా చక్రాలు, కీరా ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి. దీనిపై చిటికెడు చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. ఇది శాండ్విచ్ రుచిని రెట్టింపు చేస్తుంది.
Also Read: వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!
2. మీకు చీజ్ ఇష్టమైతే, ఈ కూరగాయల పై కొద్దిగా చీజ్ తురుము లేదా ఒక చీజ్ స్లైస్‌ను ఉంచాలి. ఇప్పుడు మరో బ్రెడ్ స్లైస్‌తో దానిని కవర్ చేసి నొక్కాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేయాలి. పాన్ వేడెక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్‌ను దానిపై పెట్టాలి. మంటను మీడియంగా ఉంచి, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి.
3. రెండు వైపులా చక్కగా కాలిపోయిన తర్వాత, వేడి వేడి శాండ్విచ్‌ను మధ్యలోకి కట్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి.అంతే.. కేవలం ఐదు నిమిషాల్లో నోరూరించే వెజ్ శాండ్విచ్ రెడీ!
తక్కువ సమయంలో.. ఎలాంటి కష్టపడకుండా ఆకలి తీర్చే ఈ క్విక్ వెజ్ శాండ్విచ్ పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. ఉదయం పూట హడావుడి లేకుండా.. హెల్దీగా ఏదైనా తినాలనుకుంటే.. ఈ ట్రెండీ శాండ్విచ్ రెసిపీని కచ్చితంగా ట్రై చేయండి.