E-Paper
Advertisement

నాగ్‌పూర్‌లో బీజేపీకి ఘోర పరాజయం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

నాగ్‌పూర్‌లో బీజేపీకి ఘోర పరాజయం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mahesh Kumar: మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలోనే బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగ్‌పూర్‌లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలిచిందని, కొట్టాలంటే కుంభస్థలాన్ని కొట్టాలి నాగ్‌పూర్‌లో అదే చేశాం అని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మోడీ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వారణాసి ఫలితాలే చెబుతున్నాయని అన్నారు. వారణాసిలో బీజేపీ ఓటమికి మోడీ బాధ్యత వహించాలన్నారు మోడీకి నైతికత ఉంటే తన వైఫల్యాలను అంగీకరించాలని అన్నారు.

వారణాసిలో బీజేపీ డౌన్..

కర్ణాటకలో కాంగ్రెస్ ఓడితే ప్రభుత్వానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. మరి వారణాసిలో బీజేపీ ఓడితే మోడీ పాలనకు వ్యతిరేకం కాదా బీజేపీకి కర్ణాటకలో ఒక నీతి.. వారణాసిలో మరో నీతా నాగ్‌పూర్‌లోనే బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. యువత, చదువుకున్న వర్గాల్లో మోడీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది. లక్నో నుంచి పాట్నా వరకు బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అన్నారు. యోగి సొంత ప్రాంతం గోరఖ్‌పూర్‌లో కేవలం 307 ఓట్లతో బీజేపీ గట్టెక్కిందని, బీజేపీ అగ్రనేతల సొంత ప్రాంతాల్లోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వస్తోందని అన్నారు.

Advertisement

Also read: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

బీజేపీ కంచుకోట..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడే దమ్ముంటే మోడీ ప్రెస్‌మీట్ పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ప్రధాని అయి 12 ఏళ్లు దాటినా ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్ పెట్టలేదు. ప్రెస్‌మీట్ పెట్టలేని ప్రధాని ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం. బీజేపీ కంచుకోట నాగ్‌పూర్‌లోనే కాంగ్రెస్ జెండా ఎగరేశామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మూడు అంకెల సీట్లు కూడా రావని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో..

Advertisement

రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ప్రజల మద్దతు పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నవంబర్ 1న ఢిల్లీలో ఓటు చోరీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపడతామని, బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి వేలాదిగా తరలివెళ్తామని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల ఓట్లను వెంటనే తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.

Also read: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

Tags

Related News

జగిత్యాల శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం.. బొమ్మకు సూదులు గుచ్చి..?

ఎల్ నినో ఎఫెక్ట్.. ఆ ఉచిత పథకంపై తెలంగాణ సర్కార్ నీలినీడలు!

ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

మేడ్చల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ పథకం!

శ్రీచైతన్య కాలేజీలో దారుణం కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి పరిస్థితి విషమం!

పంట పొలాల్లో మొసలి నానాహంగామా.. రైతులు ఎలా పట్టేశారు? మెదక్ జిల్లాలో ఘటన

రూటు మార్చిన కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణలు, జగన్ సలహాతోనే! జాయినింగ్ ఎప్పుడు?

Big Stories

Advertisement
×