E-Paper
Advertisement

వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!

వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!
Advertisement

Vankaya masala curry: వంకాయ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. వంకాయతో ఏ కూర చేసినా దాని రుచే వేరు. ముఖ్యంగా ..ఆదివారం పూట లేదా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కాస్త స్పెషల్‌గా ఏదైనా చేయాలనుకుంటే ట్రెండీ అండ్ స్పైసీ వంకాయ మసాలా కర్రీ బెస్ట్ ఛాయిస్. హోటల్స్‌లో లేదా దాబాల్లో ఆర్డర్ చేసే గుత్తి వంకాయ కూర రుచి ఇంటి దగ్గరే రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరి పోతుంది. గుమగుమలాడే మసాలా దినుసులతో ఈ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ చూసేద్దాం!

కావాల్సిన పదార్థాలు:

చిన్న వంకాయలు: 8 నుంచి 10

Advertisement

పల్లీలు : 2 స్పూన్లు

నువ్వులు: 1 స్పూన్

Advertisement

ధనియాలు: 2 స్పూన్లు

ఎండుకొబ్బరి తురుము: 2 స్పూన్లు

జీలకర్ర: 1 స్పూన్

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు: 2 (పేస్ట్ లేదా ముక్కలు)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్

కారం: రుచికి సరిపడా

పసుపు: చిటికెడు

గరం మసాలా: అర స్పూన్

నూనె: తగినంత

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారీ విధానం :

1. ఈ కూరకి అసలైన హైలైట్ దాని సువాసననిచ్చే మసాలా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరి వేసి దోరగా వేయించాలి. ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి (కాస్త నీళ్లు కలుపుకోవచ్చు).

2. వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు ఉంచి చివర నాలుగు భాగాలుగా (గాట్లు పెట్టుకోవాలి) చీల్చాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో ఈ వంకాయలను వేసి ఉంచితే అవి నల్లబడకుండా ఉంటాయి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఈ వంకాయలను సగం ఉడికే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

Also Read: నోరూరించే దోసకాయ టమాటో పచ్చడి..రోట్లో నూరితే అమృతమే!

3.అదే కడాయిలో మరికొంత నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమాటా ముక్కలు లేదా టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

4. టమాటా గుజ్జు బాగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీ-నువ్వుల మసాలా పేస్ట్ వేయాలి. అందులోనే కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అడుగు అంటకుండా నూనె వదిలే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఆపై ముందుగా.. వేయించి పెట్టుకున్న వంకాయలను ఈ గ్రేవీలో మెల్లగా సర్దుకోవాలి. మసాలా వంకాయలకు బాగా పట్టేలా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

5. ఇప్పుడు కూరకు సరిపడా.. గ్రేవీ కోసం ఒక కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి నూనె పైకి తేలే వరకు (సుమారు 8 నుంచి 10 నిమిషాలు) మంటను మీడియంగా ఉంచి ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే! గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ వంకాయ మసాలా కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో, బగారా రైస్‌తో లేదా చపాతీ, రోటీలతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంట్లోనే ఈ రెసిపీని ట్రై చేసి తినండి.

Tags

Related News

స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి

చింతపండు రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!

తొలిసారి డేట్‌కు వెళుతున్నారా? సినిమా వెళ్లడం కంటే ఈ 7 పనులు చేయండి

భగవద్గీత.. సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు.. మరి ఇంత అన్యాయం ఎందుకు?

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది

వాకింగ్ చేసినా సరిపోదు.. ఈ రోజువారీ అలవాట్లతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బరువు పెరుగుతున్నారా? ఇంట్లోనే ఈ 3 సింపుల్ వ్యాయామాలు చేయండి

Big Stories

Advertisement
×