E-Paper
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలు.. రెబల్స్‌‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ, రెండో ఆలోచనకు నో ఛాన్స్

స్థానిక సంస్థల ఎన్నికలు.. రెబల్స్‌‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ, రెండో ఆలోచనకు నో ఛాన్స్
Advertisement

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయంలో మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రెబల్ అభ్యర్థులపై సుదీర్ఘ చర్చ జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని, రెండో ఆలోచనకు ఆస్కారం లేదన్నారు సీఎం చంద్రబాబు. అభ్యర్థిని కాదని, ఎన్డీఏను చూసి ప్రజలు ఓటేయాలన్నారు. పార్టీ తరఫున ఎక్కడైనా రెబల్స్ పోటీ చేస్తుంటే, వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సూటిగా చెప్పేశారు. ఇందులో మరోదానికి తావులేదన్నారు.

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో రాజకీయాలపై సీఎం చర్చ

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశం తర్వాత రాష్ట్రంలో తాజా అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రుల నుంచి సమాచారం సేకరించారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో మంచి సానుకూలత ఉందన్నారు సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ రెబల్స్ నామినేషన్ల గురించి ఆరా తీశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీల వరకు చాలామంది అభ్యర్థులు రేసులో ఉన్నారని వివరించారు మంత్రులు.

రెబల్స్‌‌ గురించి మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ

Advertisement

దీనిపై ముఖ్యమంత్రి కాసింత రుసరుసలాడినట్టు సమాచారం. ఎన్నికల విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని అన్నారు. మరోమాటకు ఆలోచన లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అభ్యర్థిని కాదని, ఎన్డీఏను చూసి ప్రజలు ఓటు వేస్తారన్నారు. పార్టీ తరఫున రెబల్స్ బరిలో ఉంటే వాళ్లను సస్పెండ్ చేయాలని సూటిగా చెప్పేశారు. ఈ విషయంలో మరో దానికి తావులేదని తేల్చిచెప్పారు. ఎక్కడైనా వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రులకు సూచించారు.

త్వరలో ప్రజల వద్దకు వెళ్తామని, ఆ తర్వాత ఎవర్నీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారట సీఎం. ఈ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. ఆ తర్వాత సొసైటీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు.  అప్పటినుంచి మొత్తం పాలనపై దృష్టి పెడతామన్నారు. నవంబర్‌లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై సమావేశంలో చర్చించారు.

Advertisement

ఈలోగా పవన్ కల్యాణ్ జోక్యం చేసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తుఫానుపై సీఎం పూర్తిగా అప్రమత్తం చేయడం వల్ల అధికారులు అలర్ట్ అయ్యారని వివరించారు. ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల ఆస్తి, ప్రాణనష్టం తగ్గిందన్నారు. సంక్షోభం సమయంలో ముఖ్యమంత్రి చొరవ, అప్రమత్తం చేయడం బాగుందన్నారు డిప్యూటీ సీఎం. శుక్రవారం తూర్పుగోదావరికి వెళ్లి సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.

ALSO READ: ఏపీపై షెన్‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫోకస్.. రియాక్టయిన మంత్రి లోకేష్, రంగంలోకి అధికారులు

గురు, శుక్రవారాల్లో ఉభయ గోదావరి, తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తానని వివరించారు సీఎం. గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు వేలాది మంది మరణించారని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే దశకు చేరుకున్నామని తెలిపారు. తుఫానుల నేపథ్యంలో ప్రాణ నష్టాన్ని ఇంకా తగ్గించాలని వ్యాఖ్యానించారు. అర్నబ్ ధాటికి మత్స్యకారుల పదవులు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. డ్యామేజ్ అయిన వారికి కేంద్రంతోపాటు రాష్ట్రం నుంచి కొంత సాయం చేద్దామన్నారు సీఎం.

Related News

ఆదోని మున్సిపల్ పోరులో ఊహించని ట్విస్ట్.. తిరగబడిన జనసేన నాయకులు!

ఏపీపై షెన్‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫోకస్.. రియాక్టయిన మంత్రి లోకేష్, రంగంలోకి అధికారులు

అర్నబ్ తుఫాను అల్లకల్లోలం.. నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, కరెంటు లేదని ప్రజల..

అర్నబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. ఏపీలోని పాఠశాలలకు సెలవు, ఆ సమయంలో పరీక్షలు

ఏపీలో ‘అర్నబ్’ తుఫాన్ కదలికలపై.. సచివాలయంలో చంద్రబాబు రాత్రంతా పర్యవేక్షణ!

‘అర్నబ్’ తుపాను ప్రభావంతో.. జరిగిన నష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!

పులివెందుల అభ్యర్థిని ప్రకటించే ధైర్యం ఉందా? జగన్‌కు సత్యకుమార్ ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×