Homemade Facial Masks: ముఖం అందంగా మెరిసిపోవాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించాలి. స్కిన్ కేర్‌కు ఖరీదైన ఉత్పత్తుల అవసరం లేదు. మీ వంటింట్లో దొరికే సహజ పదార్థాలతో అద్భుతమైన ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మానికి పోషణనిచ్చి, మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి. అంతే కాకుండా తక్కువ సమయంలోనే మెరిసేలా చేస్తాయి.
1. పసుపు, తేనె మాస్క్:
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీలక్షణాల కారణంగా చర్మాన్ని కాంతివంతం చేయడానికి.. అంతే కాకుండా మచ్చలను తగ్గించడానికి సహాయ పడుతుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
కావలసినవి:
1 టీస్పూన్ తేనె
1/2 టీస్పూన్ పసుపు పొడి.
తయారీ: రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ప్రయోజనం: చర్మానికి మెరుపునిస్తుంది. అంతే కాకుండా ఇది మొటిమలు, మంటను తగ్గిస్తుంది.
2. శనగపిండి, పెరుగు మాస్క్:
శనగపిండిని తరతరాలుగా చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి.. చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
కావాల్సినవి:
2 టేబుల్ స్పూన్ల- శనగపిండి
1 టేబుల్ స్పూన్- పెరుగు
కొద్దిగా- పసుపు
తయారీ: మెత్తని పేస్ట్ లాగా కలిపి ముఖానికి.. మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనం: నూనె చర్మానికి మంచిది. అంతేకాకుడా ఇది ట్యాన్ ను తొలగించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
3. ఓట్‌మీల్, పాలు మాస్క్:
ఓట్‌మీల్ సున్నితమైన చర్మానికి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది చర్మంపై ఉండే దురద.. ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. పాలు , ఓట్స్ కలయిక చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్ల- ఓట్‌మీల్
3 టేబుల్ స్పూన్ల- పాలు/యోగార్ట్.
తయారీ: ఓట్‌మీల్‌ను పాలలో నానబెట్టి.. మెత్తబడిన తర్వాత ముఖానికి సున్నితంగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.
ప్రయోజనం: చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది మృత కణాలను తొలగించి ఉపశమనం ఇస్తుంది.
4. కలబంద, నిమ్మరసం మాస్క్:
కలబంద లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్ల- కలబంద గుజ్జు
1/2 టీస్పూన్- నిమ్మరసం.
తయారీ: రెండింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.
ప్రయోజనం: ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గించి.. కాంతిని పెంచుతుంది.
5. అరటిపండు, తేనె మాస్క్:
అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, తేమను ఇచ్చే గుణాలు ఉన్నాయి. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగు పరుస్తుంది.
కావలసినవి:
1-సగం పండిన అరటిపండు
1 టీస్పూన్- తేనె
తయారీ: అరటిపండును పేస్ట్ చేసి తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
ప్రయోజనం: పొడి చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది ముడతలను తగ్గిస్తుంది.
6. టమాటో, పెరుగు మాస్క్:
టమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ టాన్‌ను తగ్గించి.. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
Also Read: ఎయిర్ ఫ్రయర్‌లో.. పొరపాటున కూడా ఇవి వండకూడదు !
కావలసినవి:
1 టేబుల్ స్పూన్- టమాటో గుజ్జు
1 టేబుల్ స్పూన్- పెరుగు
తయారీ: రెండింటిని కలిపి ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయండి. 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేయండి.
ప్రయోజనం: టాన్, నల్ల మచ్చలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని తెల్లగా మార్చడంలో కూడా ఎంతగాలో ఉపయోగపడుతుంది.