E-Paper
Advertisement

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు
Advertisement

KL Rahul Survives LBW Scare:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st Test) మధ్య తొలి టెస్ట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు ఇరగదీయగా… రెండో రోజు టీమిండియా కూడా దూకుడుగా ఆడుతోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ ( KL Rahul), యశస్వి జైశ్వాల్  (Yashasvi Jaiswal) వాళ్ళిద్దరూ అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు వరుసగా రెండు లైఫ్ లు వచ్చాయి. నాలుగో ఓవర్ లో ఒకసారి ఔట్ కాకుండా బయటపడ్డ కేఎల్ రాహుల్… ఏడవ ఓవర్ లో న్యూజిలాండ్ రివ్యూ తీసుకోక‌పోవ‌డంతో ల‌క్కీగా బ‌య‌ట‌ప‌డ్డాడు. రెండు లైఫ్ లు వచ్చిన నేపథ్యంలో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ అర్ధ సెంచ‌రీ ఫినిష్ చేసుకున్నాడు.

అంపైర్ ధ‌ర్మ‌సేన త‌ప్పుడు నిర్ణ‌యాలు..రెండుసార్లు బ‌య‌ట‌ప‌డ్డ‌ రాహుల్

రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో నాలుగో ఓవర్ కైల్ జేమీస‌న్ వేశాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ ప్యాడ్లకు బంతి తగిలింది. కానీ అంపైర్ కుమార‌ ధర్మసేన మాత్రం నాటౌట్ గా ప్రకటించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ రివ్యూ తీసుకోగా… అల్ట్రాఎడ్జ్ లో బ్యాట్, ప్యాడ్ల‌కు ఒకేసారి తగిలినట్టు కనిపించింది. కానీ బాల్ ట్రాకింగ్ ఇంపాక్ట్ ఆఫ్ స్టంప్ వెలుపల ఉన్న నేపథ్యంలో ధర్మసేన నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ గా థ‌ర్డ్ అంపైర్ ప్రకటించేశారు. దీంతో న్యూజిలాండ్ రివ్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఏడో ఓవర్ మాట్ హెన్రీ సందించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

ఈ క్రమంలో ఇన్ స్వింగర్ ను ఎదుర్కొనే క్రమంలో ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్… వికెట్ల ముందు మళ్ళీ దొరికిపోయాడు. అప్పుడు కూడా ధర్మసేన నాటౌట్ గా ప్రకటించాడు. ఆ సమయంలో అంపైర్ మాట్ హెన్రీ రివ్యూ తీసుకోవాలని కెప్టెన్ టామ్ లాథ‌మ్ ను రిక్వెస్ట్ చేసినా… మళ్లీ రివ్యూ కోల్పోతామని భయంతో వెనకడుగేశాడు. కానీ రిప్లై లో కెఎల్ రాహుల్ ఔట్ గా తేలింది. ఈ క్రమంలో మాట్ హెన్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన స్వెటర్ ను నేలకేసి కొట్టాడు. కెప్టెన్ టామ్ లాథ‌మ్, అంపైర్ ధ‌ర్మ‌సేన ప‌ట్ల అస‌హ‌నం వ్య‌కం చేశాడు. ఈ సంఘటనలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు 37 ఓవర్లు ఆడిన టీమిండియా ఒకే ఒక్క వికెట్ నష్టపోయి 151 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ కంటే 217 పరుగులు వెనుకబడి ఉంది. అటు 368 పరుగులకు ఇవాళ ఉదయం న్యూజిలాండ్ ఆలౌట్ అయింది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

బుమ్రా తప్ప అందరూ డమ్మీలే…సిరాజ్ ఆడింటే తొలి రోజే న్యూజిలాండ్ కుప్పకూలేది

టీమిండియా ట్రోలింగ్ తట్టుకుని నిలబడ్డ హంజాకు రూ.20 లక్షల నజరానా ప్రకటించిన షాహిద్ అఫ్రిది

న‌వంబ‌ర్ 22న మేం కొట్టే దెబ్బ‌కు ఖ‌తార్ నుంచి టీమిండియా పారిపోతుంది

పెషావ‌ర్ జ‌ల్మీలో అంద‌రూ దొంగ‌లే…బాల్ టాంప‌రింగ్ చేసి PSL 2026 టైటిల్ గెలిచారు

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా

Big Stories

Advertisement
×