E-Paper
Advertisement

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి
Advertisement

Parenting Tips For Child Safety| పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు.. వెంటనే వారితో స్నేహం చేసేస్తారు. ఎవరైనా చాక్లెట్ ఇస్తాను, బొమ్మ కొనిస్తాను అని చెప్పగానే సులభంగా నమ్మేస్తారు. అయితే పిల్లల ఈ అమాయకత్వాన్ని కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. స్కూల్‌లో, పార్కుల్లో, బయట ఆడుకునేటప్పుడు మాత్రమే కాదు.. మొబైల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా పిల్లలకు తెలియని వ్యక్తులు పరిచయం కావచ్చు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యక్తిగత భద్రత గురించి కొన్ని విషయాలు నేర్పించడం చాలా ముఖ్యం. మీ పిల్లలు ఇతరుల మాటలకు మోసపోకుండా, తమను తాము రక్షించుకోగలిగేలా చేయాలంటే ఈ 7 విషయాలు తప్పకుండా చెప్పండి.

1. అందరూ మంచివారే అని నమ్మకూడదని నేర్పాలి

పిల్లలు ప్రేమగా మాట్లాడే ప్రతి వ్యక్తిని మంచివారిగా భావిస్తారు. అయితే తియ్యగా మాట్లాడేవారందరికీ మంచి ఉద్దేశాలు ఉండవని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరైనా చాక్లెట్లు, బొమ్మలు ఇస్తామని చెప్పినా వెంటనే తీసుకోకూడదు. తెలియని వ్యక్తులతో ఎక్కడికీ వెళ్లకూడదు. ఏదైనా తీసుకునే ముందు తల్లిదండ్రులను అడగాలని నేర్పించాలి.

2. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు

Advertisement

పిల్లలు కొత్తవారితో మాట్లాడేటప్పుడు ఇంటి వివరాలు కూడా చెప్పేస్తుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఎక్కడ పనిచేస్తారు వంటి విషయాలు బయటపెడతారు. ఇంటి చిరునామా, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, కుటుంబ వివరాలు అపరిచితులకు చెప్పకూడదని వివరించాలి.

3. ఇష్టం లేని పనులకు నో చెప్పడం నేర్పించాలి

కొంతమంది పిల్లలు ఎదుటివారిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో ప్రతి పనికీ అంగీకరిస్తారు. స్నేహితులు బలవంతం చేసినా ఇష్టం లేని పనులు చేయకూడదని చెప్పాలి. తమకు నచ్చని విషయాలకు ధైర్యంగా నో చెప్పవచ్చని నేర్పించాలి. వారి నిర్ణయాలకు తల్లిదండ్రులు మద్దతుగా ఉంటారని భరోసా ఇవ్వాలి.

Advertisement

4. ఏదైనా సమస్య వస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి

స్కూల్‌లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బెదిరించినా పిల్లలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. కొన్నిసార్లు ఎదుటివారు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని హెచ్చరించవచ్చు. అలాంటి మాటలు నమ్మకూడదని వివరించాలి. పిల్లలు భయపడకుండా ప్రతి విషయాన్ని చెప్పగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి.

5. ఇతరులు చెప్పిన ప్రతి మాటను నమ్మకూడదు

స్నేహితులు ఏదైనా పని చేయమంటే కొందరు పిల్లలు ఆలోచించకుండా అంగీకరిస్తారు. అందరూ చేస్తున్నారని చెప్పినంత మాత్రాన అది సరైన పని కాదని వివరించాలి. ఏదైనా సందేహం వస్తే తల్లిదండ్రులను అడగాలని చెప్పాలి. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటు పెంచాలి.

Also Read: ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్

6. మొబైల్, ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్త

ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా ద్వారా పిల్లలకు తెలియని వ్యక్తులు పరిచయం కావచ్చు. అలాంటి వారితో వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామా పంపకూడదు. అనుమానాస్పద లింక్స్ తెరవకూడదు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి.

Also Read: విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

7. బహుమతుల ఆశతో తప్పులు చేయకూడదు

పిల్లలకు చాక్లెట్లు, బొమ్మలు, కొత్త గేమ్స్ అంటే చాలా ఇష్టం. కొందరు ఈ ఆశను ఉపయోగించుకుని పిల్లలను మోసం చేయవచ్చు. గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎవరైనా తమతో రమ్మంటే వెళ్లకూడదు. ఏదైనా బహుమతి తీసుకునే ముందు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని నేర్పించాలి.

పిల్లలకు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించాలి. ముఖ్యంగా వ్యక్తిగత భద్రత, ఇతరులను అర్థం చేసుకోవడం, ధైర్యంగా నో చెప్పడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం మాట్లాడాలి. అప్పుడే పిల్లలు తమ సమస్యలను భయపడకుండా పంచుకుంటారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో వారిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడగలవు.

Related News

మీకు తెలుసా నెమళ్లు విషపూరిత పాములను చంపి తిన్నా చనిపోవు.. ఎందుకంటే

తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆకర్షణ ఎక్కువ

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

చలికాలంలో జుట్టు పొడిబారే సమస్య.. నో టెన్షన్ ఈ 4 రకాలపూలతో హెయిర్ కేర్ చేయండి

వివాహ బంధంలో ఒకరు మోసం చేస్తే విడిపోవాల్సిందినా? లేదా మోసం చేసిన వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలా?

మైదా లేకుండానే ఇంత క్రిస్పీ సమోసా చేయొచ్చా? ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట అస్సలు కొనరు!

ఒక్క సిప్ తాగితే చాలు మైమరచిపోవాల్సిందే.. ఈ స్పైసీ చికెన్ సూప్ సీక్రెట్ ఇదే!

Big Stories

Advertisement
×