E-Paper
Advertisement

మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు

మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు
Advertisement

Ravana Second Queen| రామాయణంలో రావణుడి పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అతని భార్య మండోదరి. అయితే రావణుడికి చాలామంది భార్యలు ఉండేవారని చాలామందికి తెలియదు. వారిలో ప్రముఖురాలు ధన్యమాలిని. రామాయణంలోని ఈ పాత్ర గురించి పెద్దగా చర్చ జరగకపోయినా, ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు కథనాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమె కుమారుడు అతికాయుడు లంకలో అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందిన అతికాయుడు రామాయణ యుద్ధంలో భీభత్సం సృష్టిచాడు. కొండనే ఎత్తగలిగే బలం అతని సొంతం. అయితే ధన్యమాలిని ఎవరు? ఆమె కుమారుల కథ ఏమిటి? రామాయణంలో ఆమె ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది? తెలుసుకుందాం.

రావణుడి భార్యగా, అతికాయుడి తల్లిగా గుర్తింపు పొందిన ధన్యమాలిని

ధన్యమాలిని గురించి కొన్ని జానపద కథనాల్లో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమెను రాక్షస రాజు మయుడు, అప్సరస హేమకు జన్మించిన కుమార్తెగా చెబుతారు. అలాగే మండోదరికి చెల్లెలిగా కూడా కొన్ని కథనాలు పేర్కొంటాయి. వివిధ సంప్రదాయాల్లో ఆమె స్వభావాన్ని ప్రశాంతంగా, సరళంగా, భక్తి కలిగిన మహిళగా వర్ణిస్తారు. రావణుడిని వివాహం చేసుకున్న తర్వాత లంక రాజకుటుంబంలో ఆమెకు ప్రత్యేక స్థానం లభించింది. ధన్యమాలినికి నలుగురు కుమారులు.. అతికాయుడు, నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశిరుడు. వీరంతా రామరావణ యుద్ధంలో ముఖ్యమైన యోధులుగా నిలిచారు.

బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందిన అతికాయుడు

Advertisement

ధన్యమాలిని కుమారుల్లో అతికాయుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతను సాధారణ రాజకుమారుడు కాదు. ఎంతో శక్తివంతమైన యోధుడిగా లంక సైన్యంలో పేరు సంపాదించాడు. అతికాయుడు ఒక సమయంలో చక్రవాల్గిరి అనే కొండను పెకిలించాడనే కథనాలున్నాయి. రామాయణ కథనం ప్రకారం.. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతికాయుడు కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు శక్తివంతమైన దివ్య వరాలను ప్రసాదించాడు. ఈ వరాల కారణంగా అతికాయుడిని యుద్ధంలో ఓడించడం చాలా కష్టమైంది. అయితే లంక యుద్ధ సమయంలో లక్ష్మణుడు అతనితో పోరాడాడు. చివరకు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతికాయుడిని సంహరించాడు. ఈ సంఘటన రామాయణ యుద్ధంలో కీలక ఘట్టంగా నిలిచింది.

Also Read: సుగ్రీవుడికి అన్యాయం చేసిన వాలి.. మహాబలి హనుమాన్ ఎందుకు అడ్డుకోలేదు..

వాల్మీకి రామాయణంలో కూడా ధన్యమాలిని ప్రస్తావన

Advertisement

ధన్యమాలిని పేరు వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ప్రస్తావనకు వచ్చినట్లు కథనాలు పేర్కొంటాయి. అందులోని 22వ సర్గ, 39వ శ్లోకంలో ఆమె ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు. రావణుడు సీతాదేవిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న సమయంలో ధన్యమాలిని రావణుడి దగ్గరకు వెళ్లి అతడిని ఆలింగనం చేసుకుని మాట్లాడినట్లు సంస్కృత శ్లోకం వివరిస్తుంది. ఈ చిన్న ప్రస్తావన కూడా రామాయణంలో ధన్యమాలిని పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

Also Read: వాల్మీకి కంటే ముందే రామాయణం రచించిన హనుమంతుడు.. మరి సముద్రంలోకి ఎందుకు పడేశాడు.. ఈ ఆసక్తికర కథ తెలుసా?

మండోదరిలా ధన్యమాలిని కథ ఎందుకు ప్రాచుర్యం పొందలేదు?

రామాయణంలో మండోదరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఆమె రావణుడి అధర్మాన్ని పలుమార్లు ప్రశ్నించారు. సీతాదేవిని తిరిగి రాముడి వద్దకు పంపించాలని సలహా ఇచ్చారు. ధన్యమాలిని గురించి మాత్రం విస్తృతంగా వివరాలు కనిపించవు. ఆమె ప్రస్తావన కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంది. అందుకే ప్రజల్లో ఆమె కథ అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయినప్పటికీ రావణుడి కుటుంబం, అతికాయుడి వీరత్వం, సుందరకాండలో ఆమె ప్రస్తావన వంటి అంశాలు ధన్యమాలిని పాత్రను ఆసక్తికరంగా మారుస్తాయి.

Also Read: భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు

Related News

మంచి పెర్ఫ్యూమ్‌ కొనాలని చూస్తున్నారా? మీ పర్సనాలటీకి ఏటి సూట్ అవుతుందో ఇలా తెలుసుకోండి

పెళ్లి రోజు వధువు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలా? వారం రోజులు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్ మెంతికూర మటన్ గ్రేవీ.. ఇలా చేస్తే ముక్క వెన్నలా కరిగిపోతుంది!

తీపి, కారం కలయికతో నోరూరించే చిలగడదుంప పచ్చడి.. పిల్లల కూడా తెగ ఇష్టంతో తినేస్తారు!

చలికాలంలో బెల్లం తింటే మతిపోయే లాభాలు? కానీ ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

పిల్లలకు క్యారెట్ తినిపించడం ఇక ఈజీ.. ఇలా టేస్టీ రోల్స్ చేసి పెట్టండి!

పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తున్నారా? మగాళ్లు చేసే ఈ 5 తప్పులే కొంపముంచుతున్నాయి!

Big Stories

Advertisement
×