E-Paper
Advertisement

Triphala Churnam : ఈ చూర్ణంతో 90శాతం వ్యాధులు మాయం

Triphala Churnam : ఈ చూర్ణంతో 90శాతం వ్యాధులు మాయం
Advertisement

Triphala Churnam : త్రిఫల చూర్ణం.. ఇది ఉసిరి, తానికాయ, కరక్కాయల మిశ్రమం. ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ చూర్ణం ఒక స్పూన్‌ తీసుకుంటే జీర్ణాశయం బాగా పనిచేస్తుంది, కడుపు శుద్ధి అవుతుంది. అజీర్తి, ఆకలి పెరగడానికి కూడా ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. జలుబు ఉంటే కూడా ఇట్టే తొలగిపోతుంది. ఉదయం, రాత్రి ఒక స్పూన్‌ చొప్పున ఇది మజ్జిగతో కలిపి తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి. తేన్పులు, ఎక్కిళ్లు ఎక్కువగా వస్తుంటే త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాస్‌ నీటితో తీసుకోవాలి. రాత్రి పూట ఒక స్పూన్‌ గ్లాస్‌ నీటితో తాగితే విరేచనం సాఫీగా అవుతుంది.

గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే గొంతులోని సమస్యలన్నీపోతాయి. ఒక చెంచా చూర్ణాన్ని మగ్గులో వేసి బాగా కలిపి కళ్లు కడుకుంటే కంటి సమస్యలు పోతాయి. మీ శరీరం ఎక్కువగా చెమట వాసన వస్తుంటే ఈ చూర్ణం రోజూ తింటే చెమట దుర్వాసన పోతుంది. మూత్రం సాఫీగా రావాలంటే దీన్ని ఒక గ్లాస్ నిమ్మరసంతో కలిపి తాగితే అద్భుత ఫలితం ఉంటుంది.

Advertisement

అంతేకాకుండా మూత్రంలో మంట వస్తుంటే ఒక గ్లాస్ మజ్జిగతో ఒక స్పూన్‌ ఈ పొడి కలిపి ఉదయం, రాత్రి తీసుకోవాలి. అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణం జుట్టు సమస్యలకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. వెంట్రుకలు బలంగా ఉండేందుకు ఈ చూర్ణాన్ని ఒక చెంచా తీసుకుని శీకాయ, కుంకుడు కలిపి తలస్నానం చేస్తే జుట్టు బాగా దట్టంగా పెరుగుతుంది. రాలడం కూడా ఆగిపోతుంది.

గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు రోజూ ఈ చూర్ణం ఒక స్పూన్ తీసుకుంటే గ్యాస్ సమస్య పోతుంది. పొట్ట తగ్గాలంటే కూడా దీన్ని రోజూ ఉదయం, రాత్రి ఆహారం తినే ముందు ఒక స్పూన్ గ్లాసు నీటితో కలిపి తీసుకుంటే పొట్టభాగం తగ్గిపోతుంది. ఎక్కువగా చెడు కొవ్వు ఉన్నవాళ్లు కూడా దీన్ని ఉదయం, రాత్రి ఒక చెంచా నీళ్లలో వేసుకొని తేనె కలుపుకొని తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. కాలేయం, గుండె కవాటాల్లో ఉన్న అధిక కొవ్వు పోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే 90శాతం వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×