Anger Management Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం సర్వసాధారణం అయిపోయింది. ఆఫీస్ ప్రెజర్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా కారణం ఏదైనా కావచ్చు.. కోపం వచ్చినప్పుడు మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ బ్రెయిన్ సైంటిస్ట్ డాక్టర్ జిల్ బోల్ట్ టేలర్ కనుగొన్న ’90-సెకన్ల నియమం’ ప్రకారం.. మన శరీరంలో కోపం అనేది కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే రసాయనిక ప్రక్రియగా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పొడిగించాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
సైన్స్ ప్రకారం.. మనకు కోపం తెప్పించే ఒక సంఘటన జరిగినప్పుడు లేదా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, మెదడులోని ‘అమిగ్డాలా’అనే భాగం అలర్ట్ అవుతుంది. అది వెంటనే శరీరంలోకి అడ్రినలిన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడం, ముఖం ఎరుపెక్కడం జరుగుతుంది. అయితే.. ఈ హార్మోన్లు రక్తంలోకి చేరి, పూర్తిగా ఫ్లష్ అవుట్ అవ్వడానికి పట్టే సమయం ఖచ్చితంగా 90 సెకన్లు మాత్రమే! అంటే ఆ ఒకటిన్నర నిమిషం పాటు.. మీ శరీరంలో ఒక రసాయనిక తుఫాను నడుస్తుంది. ఆ 90 సెకన్లు దాటిన తర్వాత కూడా మీరు కోపంగా ఉన్నారంటే.. దానికి కారణం మీ శరీరం కాదు.. మీ మనస్సే! ఆ కోపాన్ని మీరే ఆలోచనల ద్వారా పదే పదే గుర్తుచేసుకుంటూ పోషిస్తున్నారని అర్థం.
కోపం వచ్చినప్పుడు ఆ 90 సెకన్లను ఎలా దాటాలి?:
మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. పాజ్ బటన్ నొక్కండి : ఎవరైనా మిమ్మల్ని కోప్పడితే.. వెంటనే కౌంటర్ ఇవ్వకండి. ఒక్క క్షణం ఆగి, మీ మైండ్‌కు “ఇప్పుడు నా 90 సెకన్ల టైం స్టార్ట్ అయింది” అని గుర్తుచేసుకోండి.
2. డీప్ బ్రీతింగ్ : ఆ 90 సెకన్లలో దీర్ఘంగా శ్వాస తీసుకోండి. 4 సెకన్లు శ్వాస పీల్చడం, 4 సెకన్లు హోల్డ్ చేయడం, 4 సెకన్లు వదలడం చేయండి. దీని వల్ల మెదడుకు ఆక్సిజన్ అంది రసాయనాల వేగం తగ్గుతుంది.
3. ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోండి: వీలైతే కోపం తెప్పించిన వ్యక్తి లేదా స్థలం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు పక్కకు వెళ్ళిపోండి లేదా మంచి నీళ్లు తాగండి.
4. గమనించండి: మీ శరీరంలో వస్తున్న మార్పులను గమనించండి. “నా గుండె వేగంగా కొట్టుకుంటోంది, ఇది కేవలం 90 సెకన్ల కెమికల్ రియాక్షన్ మాత్రమే, తగ్గిపోతుంది” అని మీకు మీరే చెప్పుకోండి.
Also Read: మీ కొలెస్ట్రాల్ రిపోర్టులో ఈ రీడింగ్స్ ఉన్నాయా? అయితే మీ గుండె డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
దీనివల్ల మానసిక ఆరోగ్యానికి జరిగే లాభాలు:
బీపీ కంట్రోల్ అవుతుంది: తరచూ కోప్పడటం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రూల్ వల్ల మీ బీపీ నార్మల్‌గా ఉంటుంది.
రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి: కోపంలో అనే మాటలు వెనక్కి తీసుకోలేం. 90 సెకన్లు సైలెంట్‌గా ఉండటం వల్ల ఎన్నో బంధాలు విడిపోకుండా కాపాడుకోవచ్చు.
ప్రశాంతత: మీ ఎమోషన్స్‌పై మీకు కంట్రోల్ రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కోపం రావడం తప్పు కాదు, కానీ దానికి బానిస అవ్వడం ముమ్మాటికీ తప్పే. “కోపం మనల్ని కంట్రోల్ చేసే కంటే, మనమే కోపాన్ని కంట్రోల్ చేయాలి”. నెక్స్ట్ టైమ్ మీకు ఎప్పుడైనా కోపం వస్తే, ఈ ’90-సెకన్ల నియమం’ మ్యాజిక్‌ను గుర్తు తెచ్చుకోండి. ఒకటిన్నర నిమిషం ఓపిక పడితే.. మీ మానసిక ఆరోగ్యం అద్భుతంగా మారుతుంది.