E-Paper
Advertisement

సీక్రెట్ మసాలాలతో తందూరీ మోమోస్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!

సీక్రెట్ మసాలాలతో తందూరీ మోమోస్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Advertisement

Tandoori Momos Recipe: చాలామందికి మోమోస్ ఫేవరెట్ స్నాక్స్ లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మసాలాలతో తయారు చేసే తందూరీ మోమోస్ రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెరుగు, కారం, వివిధ మసాలాలతో తయారు చేసిన మిశ్రమంలో మోమోస్‌ను కలిపి కాల్చడం వల్ల ఇవి మంచి రుచి, సువాసనతో నోరూరిస్తాయి. రెస్టారెంట్లలో లభించే ఈ స్పెషల్ స్నాక్‌ను ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో ఫిల్లింగ్ తయారు చేసి, మోమోస్‌కు తందూరీ మసాలా కోటింగ్ ఇచ్చి కాల్చుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్ సిద్ధమవుతుంది. మరి ఈ టేస్టీ తందూరీ మోమోస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

మైదా – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – రెండు టీస్పూన్లు, క్యాబేజీ తురుము – అర కప్పు, క్యారెట్ తురుము – పావు కప్పు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, పెరుగు – అర కప్పు, కారం – ఒక టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి – పావు టీస్పూన్,
నిమ్మరసం – ఒక టీస్పూన్, శనగపిండి – ఒక టీస్పూన్, కసూరి మెంతి – అర టీస్పూన్.

Advertisement

Also Read: బంగాళాదుంపలు, పాలకూరతో టేస్టీ హరాభరా కబాబ్.. తయారీ చాలా సులభం!

తందూరి మోమోస్ తయారీ విధానం:

ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలిపి 10 – 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

Advertisement

ఇప్పుడు మరో గిన్నెలో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పలుచగా ఒత్తి, మధ్యలో కూర మిశ్రమం పెట్టి మోమోస్ ఆకారంలో మడవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్‌లో 10 – 12 నిమిషాలు ఉడికించాలి.

తర్వాత పెరుగులో కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, శనగపిండి, కసూరి మెంతి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఉడికించిన మోమోస్‌కు ఈ మిశ్రమాన్ని పట్టించి 15 నిమిషాలు నాననివ్వాలి.

చివరగా పెనంపై కొద్దిగా నూనె వేసి మోమోస్‌ను అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి. గ్రిల్ పాన్ లేదా ఓవెన్ ఉంటే అందులోనూ కాల్చుకోవచ్చు. మోమోస్‌పై తేలికపాటి కాలిన మచ్చలు వచ్చి, మంచి సువాసన వచ్చే వరకు ఉంచాలి.

Also Read: గుమ్మడికాయ అంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఈ హల్వాను లొట్టలేసుకుంటూ తింటారు!

Tags

Related News

తల్లిదండ్రులతో మంచి అనుబంధం కోసం ప్రతిరోజూ ఈ 5 పనులు చేయండి

పిల్లలు స్నాక్స్ అడిగితే.. 15 నిమిషాల్లో, క్రిస్పీగా ఇలా అటుకుల పకోడి చేసిపెట్టండి!

బంగాళాదుంపలు, పాలకూరతో టేస్టీ హరాభరా కబాబ్.. తయారీ చాలా సులభం!

పల్లెటూరి స్టైల్‌లో చీరమేను చింతచిగురు కూర..చేసేయండిలా!

వెజ్ శాండ్విచ్..ఒక్క సారి తింటే టేస్ట్ మరచిపోలేరు!

గోరుచిక్కుడు వేపుడు ఇలా చేస్తే..అద్భుతమైన టేస్ట్

పండగ రోజు ఉదయం మనం చేసే ఈ ఒక్కపని.. ఆరోగ్యాన్నే కాదు అదృష్టాన్ని కూడా తెస్తుంది!

Big Stories

Advertisement
×