E-Paper
Advertisement

ఓటీటీలోకి అడుగు పెట్టిన సీఎం విజయ్ కొడుకు ఫస్ట్ మూవీ… ఎక్కడ చూడొచ్చంటే ?

ఓటీటీలోకి అడుగు పెట్టిన సీఎం విజయ్ కొడుకు ఫస్ట్ మూవీ… ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Action Thriller OTT: సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిగ్మా’ (Sigma) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కోలీవుడ్ ట్రెండ్ ప్రకారం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సందీప్ కిషన్ (Sundeep Kishan) మరోసారి తన మార్క్ యాక్షన్‌ తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, విలన్ గ్యాంగ్‌తో జరిగే మైండ్ గేమ్స్ అంతకంటే హై రేంజ్‌లో ఉంటాయి. మరి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే…

కథలోకి వెళ్తే…

గురు రేడియో జాకీగా పని చేస్తుంటాడు. అతనికి తన తల్లి జ్ఞాపకంగా మిగిలిన లైబ్రరీ అంటే ఎంతో ఇష్టం. కానీ ఆ లైబ్రరీ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో దాన్ని కాపాడుకోవడం గురుకు పెద్ద సమస్యగా మారుతుంది. డబ్బు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అతను ఓ అక్రమ క్యాసినో వ్యవహారంలో చిక్కుకుంటాడు. అప్పటిదాకా రొటీన్ గా సాగుతున్న అతని ప్రయాణం ఒక్కసారిగా గ్యాంగ్‌స్టర్లు, అండర్‌వరల్డ్‌ ముఠాల మధ్య జరిగే పోరాటంగా మారుతుంది.

Advertisement

ఈ వ్యవహారంలో విదేశాల్లో దాచిన భారీ నిధికి సంబంధించిన ఓ తాళం చెవి గురు చేతికి వస్తుంది. ఆ నిధిలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు అక్రమ సంపద ఉందని తెలుస్తుంది. అంతేకాదు, ఆ తాళం చెవికి సంబంధించిన పెన్‌డ్రైవ్‌లో కీలకమైన రహస్యాలు కూడా ఉంటాయి. దీంతో ఆ తాళం చెవి కోసం రెండు క్రిమినల్ గ్యాంగులు వేట మొదలుపెడతాయి. ఒకవైపు విన్సెంట్ గ్యాంగ్, మరోవైపు వీరయ్య రెడ్డి ముఠా దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తాయి.

ఈ రెండు గ్యాంగుల మధ్య జరిగే పోరాటంలో గురు అనుకోకుండా కీలక వ్యక్తిగా మారిపోతాడు. తన లైబ్రరీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొదలైన అతని ప్రయత్నం, చివరకు భారీ నిధిని చేజిక్కించుకునే గేమ్‌గా మారుతుంది. ఇంతకీ ఆ తాళం చెవి ఎవరి చేతికి చిక్కుతుంది ? గురు తన తల్లి జ్ఞాపకంగా ఉన్న లైబ్రరీని కాపాడుకోగలడా ? గ్యాంగ్‌స్టర్ల మధ్య చిక్కుకున్న అతను తన ప్లాన్‌ను ఎలా పూర్తి చేస్తాడు ? ఈ జర్నీలో హీరో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు ? గ్యాంగ్‌స్టర్స్ వేసే ప్లాన్లను ఎలా తిప్పికొట్టాడు ? ఇందులో ఫరియా అబ్దుల్లా పాత్ర ఏంటి ? అనేదే మిగతా కథ.

ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘సిగ్మా’ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా మొత్తం ఐదు భాషల్లో చూడొచ్చు. థియేటర్లలో తమిళం, తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఇతర భాషల ప్రేక్షకులకూ అందుబాటులోకి వచ్చింది. సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా కావడంతో ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీకెండ్‌లో ఏదైనా పక్కా మాస్, యాక్షన్ ప్యాక్డ్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్. ఎస్పెషల్లీ క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుంది, సో డోంట్ మిస్ ఇట్.

Read Also: ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

Tags

Related News

OTT Movies : ఓటీటీ లవర్స్ కు పునకాలే .. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

మాటలకందని బంధం… కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

హాస్టల్‌లో అమ్మాయిలు మిస్సింగ్‌… గుర్రంపై తలలేని మొండెం… వైరల్‌ హారర్‌ సిరీస్‌ వచ్చేసిందోచ్

కనిపించకుండా పోయిన తల్లి కోసం భయంకరమైన ద్వీపానికి… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్

దెయ్యాలతో హాలోవీన్‌ సెలబ్రేషన్స్… అద్దంలో అరాచకం… నవ్విస్తూనే భయపెట్టే సిరీస్‌

స్కూల్‌ టాయిలెట్‌లో గ్యాంగ్‌స్టర్‌ను బంధించే బుడ్డోడు… విజయ్ సేతుపతి క్రేజీ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రపంచాన్నే వణికించిన రియల్ డాన్‌… దశాబ్దాల పరార్‌కు తెరదించిన అరెస్ట్‌… ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

Big Stories

Advertisement
×