E-Paper
Advertisement

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!
Advertisement

Secunderabad Train Accident: స్మార్ట్‌ ఫోన్లు, ఇయర్‌ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు  గట్టి హెచ్చరికను పంపే విషాద ఘటన సికింద్రాబాద్‌ లో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన 17 ఏళ్ల యువకుడు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించిందని రైల్వే పోలీసులు వెల్లడించారు.

బోలారం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన

సికింద్రాబాద్‌లోని బోలారం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో రైల్వే అధికారులకు సమాచారం అందడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. డౌన్ లైన్ పక్కన యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని ఆల్వాల్ పరిధిలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన తోలుచూరి వివేక్‌గా గుర్తించారు. అతడి తండ్రి కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. చిన్న వయసులోనే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఇయర్‌ ఫోన్స్ స్వాధీనం

Advertisement

ఘటనా స్థలంలో పోలీసులకు కొన్ని వస్తువులు లభించాయి. మృతుడి వద్ద నుంచి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఒక జత తెల్లటి ఇయర్‌ ఫోన్‌లను గుర్తించారు. దీంతో యువకుడు ఇయర్‌ ఫోన్స్ ఉపయోగిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందని తొలుత పోలీసులు భావించారు. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో స్పష్టత కోసం పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

సీసీటీవీ ఫుటేజీలో కీలక విషయాలు

తన కుమారుడి మృతిపై కొన్ని సందేహాలను తండ్రి కృష్ణమూర్తి వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణను మరింత లోతుగా చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యువకుడు రైల్వే ట్రాక్ ప్రాంతంలోకి ప్రవేశించి, ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని ట్రాక్ మీద నడుస్తున్నట్లు ఫుటేజీలో కనిపించిందని పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లిన సమయంలో రైలును గుర్తించలేకపోవడం ప్రమాదానికి కారణం అయ్యిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇయర్‌ ఫోన్స్ వాడకంపై పోలీసుల హెచ్చరిక

Advertisement

ఈ ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నిషేధిత ప్రాంతాలని, వాటిపై నడవడం, అనధికారికంగా ప్రవేశించడం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా రైల్వే లైన్ల సమీపంలో ఇయర్‌ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల రైలు హారన్లు, హెచ్చరికలు వినిపించకపోవచ్చని తెలిపారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కూడా రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు ఇయర్‌ఫోన్స్ వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు. ఫోన్లు, మ్యూజిక్ కంటే ప్రాణాల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని యువతకు సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Read Also: అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

Tags

Related News

బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Big Stories

Advertisement
×