E-Paper

మీ కొలెస్ట్రాల్ రిపోర్టులో ఈ రీడింగ్స్ ఉన్నాయా? అయితే మీ గుండె డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

మీ కొలెస్ట్రాల్ రిపోర్టులో ఈ రీడింగ్స్ ఉన్నాయా? అయితే మీ గుండె డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

Cholesterol Report Guide: శరీరంలో కొలెస్ట్రాల్ అనగానే చాలా మంది అదొక డేంజర్ విలన్ అనుకుంటారు. కానీ మన బాడీలో కణాలు, హార్మోన్లు సరిగ్గా పనిచేయడానికి కొలెస్ట్రాల్ కూడా కొంత అవసరమే. అయితే సమస్య అంతా అది పరిమితి దాటినప్పుడే వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది గుండె ధమనులలో పేరుకుపోయి రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అందుకే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ రిపోర్టులో ఏ రీడింగ్ ఎంత ఉండాలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

కొలెస్ట్రాల్ రిపోర్టును అర్థం చేసుకోవడం ఎలా?:

మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్టులో ప్రధానంగా నాలుగు అంశాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు సింపుల్‌గా చూద్దాం.

1. టోటల్ కొలెస్ట్రాల్ (Total Cholesterol):
ఇది మీ రక్తంలో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ శాతాన్ని చెప్తుంది.

నార్మల్: 200 mg/dL కంటే తక్కువ ఉంటే మీ గుండె సేఫ్ జోన్‌లో ఉన్నట్లు.

బోర్డర్ లైన్: 200 నుంచి 239 mg/dL ఉంటే మీరు కాస్త జాగ్రత్తపడటం అవసరం.

హై రిస్క్ (డేంజర్): 240 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే డాక్టర్‌ను కలిసి లైఫ్‌స్టైల్ మార్చుకోవాలి.

2. LDL కొలెస్ట్రాల్ – అసలైన విలన్ (Bad Cholesterol):
దీనిని ‘లో-డెన్సిటీ లిపోప్రోటీన్’ అంటారు. ఇది రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. కాబట్టి ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.

ఆప్టిమల్ (బెస్ట్): 100 mg/dL కంటే తక్కువ ఉండాలి.

హై రిస్క్ (డేంజర్): 160 నుంచి 189 mg/dL ఉంటే ప్రమాదం. ఒకవేళ 190 mg/dL దాటితే అది గుండెకు అత్యంత హానికరం. దీని వల్ల ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ రావచ్చు.

3. HDL కొలెస్ట్రాల్ – మన గుండె ఫ్రెండ్ (Good Cholesterol):
దీనిని ‘హై-డెన్సిటీ లిపోప్రోటీన్’ అంటారు. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను లివర్‌కు పంపి శుభ్రం చేస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ ఉండాలి.

పురుషులలో: 40 mg/dL కంటే ఎక్కువ ఉండాలి.

స్త్రీలలో: 50 mg/dL కంటే ఎక్కువ ఉండాలి.

డేంజర్ జోన్: 40 mg/dL కంటే తక్కువ ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది.

4. ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides):
ఇది మనం తినే ఆహారం ద్వారా శరీరంలో చేరే ఒక రకమైన కొవ్వు. మనం వాడకుండా మిగిల్చేసిన క్యాలరీలు దీని రూపంలో మారతాయి.

నార్మల్: 150 mg/dL కంటే తక్కువ.

డేంజర్ జోన్: 200 నుంచి 499 mg/dL ఉంటే హై రిస్క్ కింద లెక్క. ఇది పెరిగితే ప్యాంక్రియాస్ సమస్యలతో పాటు గుండె జబ్బులు వస్తాయి.

Also Read: తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!

గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి?

ఆహారంలో మార్పులు: సమోసాలు, పిజ్జాలు, బేకరీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ (ట్రాన్స్ ఫ్యాట్స్) పూర్తిగా తగ్గించేయాలి. ఓట్స్, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రోజువారీ వ్యాయామం: రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ లేదా యోగా చేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

రెగ్యులర్ చెకప్స్:30 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు.

గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కొలెస్ట్రాల్ పెరిగే వరకు బాడీలో ఎలాంటి నొప్పులు, బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. మీ లేటెస్ట్ బ్లడ్ రిపోర్ట్ తీసి పైన చెప్పిన రీడింగ్స్‌తో క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ రీడింగ్స్ డేంజర్ జోన్‌లో ఉంటే.. ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించండి.

Related News

తరచూ కోపం వస్తోందా? మీ జీవితాన్ని మార్చేసే ’90-సెకన్ల రూల్’ ఇక్కడుంది!

మీది ప్రేమా లేక ఆకర్షణ మాత్రమేనా? తేడా ఏంటో తెలుసుకోకుండా అందరూ చేసే తప్పులివే

వేసవిలో జీన్స్ వద్దు.. ఫ్యాషనెబుల్‌గా కనిపించేందుకు ఈ స్టైలిష్ బాటమ్స్ ట్రై చేయండి

ఒంటరితనంతో బాధపడుతున్నారా? గాసిప్ చేయడం దీనికి మంచి పరిష్కారం.. ఎలాగంటే

పెద్ద రిస్క్ అని తెలిసినా భయపడరు.. ఈ తేదీల్లో పుట్టినవారి చేతి నిండా ధనమే

పొట్టకొవ్వు ఏం చేసినా తగ్గడం లేదా? నో టెన్షన్.. ఒక నెలలో 4 నుంచి 5 కిలోలు తగ్గే టిప్స్ మీ కోసం

బంగారం కంటే విలువైన టమాటా.. కిలో టమాటా విత్తనాల ధర రూ.3 కోట్లు.. ఎందుకంటే?

×