E-Paper
Advertisement

అక్బర్‌ నిజంగా జోధాబాయిని పెళ్లి చేసుకున్నాడా? 400 ఏళ్లుగా చరిత్రలో నడుస్తున్న అసలు కథ ఇదే!

అక్బర్‌ నిజంగా జోధాబాయిని పెళ్లి చేసుకున్నాడా? 400 ఏళ్లుగా చరిత్రలో నడుస్తున్న అసలు కథ ఇదే!
Advertisement

Historical Truth Behind Jodha Akbar:చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో అక్బర్, జోధాబాయిల ప్రేమ కథకు ప్రత్యేక స్థానం ఉంటుంది మొగల్ చక్రవర్తి అయిన అక్బర్, రాజ్ పుత్ యువరాణి అయిన జోధాబాయి ప్రేమ కథని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి కూడా .

వీటిలో ఐశ్వర్యరాయ్ హృతిక్ రోషన్ జంటగా నటించిన జోధా అక్బర్ Jodhaa Akbar’ (2008)సినిమా ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.
నిజానికి మనం వింటున్న అక్బర్, జోధా బాయ్ ల ప్రేమ కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది.అదేంటో తెలుసా ..మనం పిలుచుకుంటున్న అక్బర్ భార్య పేరు అసలు జోధా బాయి కాదని చరిత్ర కారులు చెబుతున్న మాట .

అక్బర్ 1562లో రాజ్‌పుత్ యువరాణిని పెళ్లి చేసుకున్నాడు

Advertisement

విషయంలోకి వెళ్తే ..అక్బర్ 1562లో అంబేర్‌ రాజు రాజా భర్మల్‌ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు .అంబేరంటే ఇప్పటి జైపూర్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజ్యం అప్పట్లో మొగలులు , రాజ్ పుత్ రాజ్యాల మధ్య చాలా ముఖ్యమైన మరియు కీలకమైన పరిస్థితులు ఉండేవి.
అక్బర్ రాజ్ పుత్ ల మధ్య జరిగిన పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు రాజ్యాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేదిగా చాలామంది భావించారు.

ఆమె పేరు జోధాబాయి కాదా?

అయితే చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం అక్బర్ కాలంలో ఏ పర్షియన్ రికార్డుల ప్రకారం చూసినా అక్బర్ భార్య పేరు జోధాబాయని పిలిచినట్టుగాఎక్కడా ఆధారం లేదని తెలుస్తుంది.అక్బర్ భార్య పేరు హర్కా బాయి, హీర కున్వరీ అనే పేర్లతో పిలిచినట్టు చరిత్రలో కనిపి స్తుంది..ఇక తర్వాత ఆమెకు మరియం-ఉజ్-జమానీ అనే గౌరవ బిరుదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ప్రిన్స్‌ సలీం. తర్వాత అతడే జహంగీర్‌గా మొఘల్‌ సింహాసనాన్ని అధిష్ఠించాడు.

జహంగీర్ తల్లి కూడా ఆమెనే!

Advertisement

ఇక ఈమెకే పుట్టిన కొడుకు ప్రిన్స్‌ సలీం తర్వాత రోజుల్లో జహంగీర్ గా మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు.ఇక మరియం-ఉజ్-జమానీ కేవలం అక్బర్ భార్యగానే రాజభవనంలో ఉండే రాణిలా కాకుండా ఆమెకు రాజకీయాలని శాసించిన మహిళగా అలాగే ఆర్థికంగానూ చాలా బలమైన మహిళగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు .

సముద్ర వ్యాపారంలోనూ ఆమెకు ఆసక్తి!

ముఖ్యంగా ఆమెకు సముద్ర వ్యాపారంలో చాలా ఆసక్తి ఉండేదని, ఇక ఆమె పేరు మీద ఎన్నో నౌకలు కూడా ఉండేవని వాటితో ఆమె వ్యాపారం చేసిందని చరిత్ర రచనలలో కనిపిస్తుంది . అంటే మనకు జోధాబాయి ఒక అక్బర్ భార్యగానే సినిమాల్లో చరిత్రలు పాట పుస్తకాల్లో కనిపిస్తుంది. కానీ ఆమె అంతకుమించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ అన్నమాట .

మరి జోధాబాయి అనే పేరు ఎలా వచ్చింది?

అక్బర్ కాలంలో జోదాబాయి అనే పేరు ఎక్కడ లేకపోవడంతో క్రమక్రమంగా ఆ పేరు తర్వాతి రోజుల్లోనే వచ్చి ఉంటుందనేది చరిత్రకారుల అంచనా.మొట్టమొదటిసారిగా 1900 శతాబ్దంలో రాజపుత్ర పై బ్రిటిష్ రచయిత జేమ్స్‌ టాడ్‌ రచనల్లో చేసిన పరిశోధనల్లో చేసిన రచనల్లో జోధాభాయి అనే పేరు మొదటిసారిగా కనిపించినట్టు తెలుస్తుంది .అయితే ఇక్కడున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే

జోధాబాయి అక్బర్ భార్య కాదు.. జహంగీర్ భార్య అనే వాదన!

జోధా అబ్బాయి అక్బర్ భార్య కాదని అక్బర్ కొడుకు జహంగీర్ భార్యగా కొన్ని ఆధారాలు చరిత్రలో కనిపిస్తున్నాయి.అంటే ఒక తరం లో ఉన్న మహిళ పేరుని మరో తరంలోని ఒక మహిళ పేరుతో కలిసిపోయింది అన్నమాట.

ఇక అక్బర్ భార్య పేరుజోధాబాయే అన్న వాదనని జోధా అక్బర్ సినిమా మరింత జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది .

‘జోధా అక్బర్’ సినిమాతో మరింత పాపులర్

2008లో వచ్చిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జోధా అక్బర్ గా నటించిన సంగతి తెలిసిందే .కానీ ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్ అవ్వడంతో అక్బర్ భార్య పేరు జోధాభాయే అని మరీ బల్ల గుద్ది చెప్పినట్టుగా అయిపోయింది .అని ఎన్నో సీరియళ్లు ,పుస్తకాలు ,కథలు వీరిపై కలగలిసి రావడంతో అక్బర్ పేరు జోధాబాయి అని పాపులర్ అయిపోయింది .

అక్బర్ జీవితంలో మరో మహిళ ఉందనే వాదన

అయితే అక్బర్ జీవితంలో ఇంకో మహిళ ఉందని తనే పోర్చుగీస్ లేడీ డోనా మారియా మస్కరెన్హాస్ అని 2017లో రచయిత లూయిస్‌ డి అసిస్‌ కొరేయా తన పుస్తకంలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇది ఒక కల్పిత వాదనగానే చూడాల్సి ఉంటుంది.

also read:భర్తలో ఈ లక్షణాలు ఉంటే.. ఆ భార్య నిజంగా లక్కీ

ఏది ఏమైనా అక్బర్ జోధాబాయ్ ల కథ పూర్తిగా అబద్ధమని చెప్పలేం కానీ రాజ్ పుత్ చెందిన మహిళని పెళ్లి చేసుకున్న విషయం మాత్రం చరిత్రలో ఉంది కానీ ఆమె పేరు జోధాబాయి మాత్రం కాదని క్రమక్రమంగా జోధాబాయి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్ర చెబుతున్న మాట.

Tags

Related News

ఆఫీస్ డెస్క్‌లో డెకరేషన్ మంచి మొక్కలు కావాలా? తక్కువ కేర్‌‌తో పచ్చ ఉండే ప్లాంట్స్ ఇవే

భర్తలో ఈ లక్షణాలు ఉంటే.. ఆ భార్య నిజంగా లక్కీ

లైక్‌లు, కామెంట్ల చుట్టూనే యువత సంతోషం..లేటెస్ట్ సర్వే ఇంట్రెస్టింగ్ విషయాలు!

నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే

రెబెల్స్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తలవంచరు

భారతదేశంలోని ఈ రాష్ట్రం బ్రిటిష్ పాలనలో ఎప్పుడూ లేదు.. ఎందుకంటే

ఇండిపెండెన్స్ డే స్టైలింగ్ టిప్స్.. అమ్మాయిలు తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రెస్సింగ్ టిప్స్

Big Stories

Advertisement
×