BigTV English

Perfumes Effect : పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా ? ఆ కౌంట్ పడిపోతుంది జాగ్రత్త !

Perfumes Effect : పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా ? ఆ కౌంట్ పడిపోతుంది జాగ్రత్త !

Side Effects of Perfume : పెర్ఫ్యూమ్.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ రోజుల్లో అందరూ వాడేస్తున్నారు. ఒకప్పుడు సెంటు వాడటం అంటే.. ఉన్నోళ్లవరకే పరిమితం. ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడంతో.. నచ్చిన సెంటును కొనుక్కొని వాడుతున్నారు. స్కూలుకెళ్లే పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే తల్లిదండ్రుల వరకూ.. అందరూ వీటికి బానిసలయ్యారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక యూత్ గురించైతే చెప్పనక్కర్లేదు. పెర్ఫ్యూమ్ లో స్నానం చేసి వచ్చినట్లే ఒళ్లంతా పూసేసుకుంటారు.


అయితే పెర్ఫ్యూమ్స్ ను కెమికల్స్ తో తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. నిజమైన సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే పెర్ఫ్యూమ్స్ చాలా ఖరీదుగా ఉంటాయి. మనకు చవకగా లభించేవన్నీ కెమికల్స్ పూరితమే. పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడితే చర్మసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావొచ్చు. చంకలు నల్లగా అవ్వడం, అలర్జీ వంటి సమస్యల్ని మీలో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు.

Also Read : పసుపు ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవడం పక్కా !


తాజాగా కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. పెర్ఫ్యూమ్స్ ను ఎక్కువగా వాడితే.. అది స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుందని ఆ అధ్యయనంలో తేలిందట. ఫలితంగా ఇది సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కారణం.. కొన్ని రకాల పెర్ఫ్యూమ్స్ లో పారాబెన్ లను అధికంగా ఉపయోగించడమే. పారాబెన్ లు ఎక్కువగా ఉన్న పెర్ఫ్యూమ్స్ ను వాడితే.. స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని, అది కాలక్రమేణా వంధ్వత్వానికి దారితీస్తుందని ఆ పరిశోధనలో తేలిందట. అందుకే పెర్ఫ్యూమ్స్ ను ఎక్కువగా వాడే పురుషులు.. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండండి. పెర్ఫ్యూమ్ ల వాడకాన్ని తగ్గించండి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×