Aloe Vera For Hair: మీ ఇంట్లో ఉండే ఒక చిన్న మొక్క మీ మ్యాజిక్ చేయగలదని మీకు తెలుసా? అవును.. కలబంద గురించి ఎప్పుడో ఒకప్పుడు మీరు వినే ఉంటారు. ఇది మీ జుట్టుకు దివ్యౌషధం కంటే తక్కువేమీ కాదు. కలబందలో విటమిన్లు, ఖనిజాలు , యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.
ఇవి జుట్టును లోపలి నుండి పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును బలంగా చేస్తాయి. మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉంటే.. లేదా రాలిపోతుంటే కలబంద జెల్ మీకు గొప్ప పరిష్కారం. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడమే కాకుండా.. తలపై ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. ఫలితంగా జుట్టు సంబంధిత సమస్యలు రావడానికి కూడా అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ఈ రోజుల్లో.. కాలుష్యం, ఒత్తిడి మన జుట్టును బలహీనపరుస్తోంది. ఇలాంటి సమయంలో కలబంద జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును హానికరమైన రసాయనాల నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా వాటిని సహజంగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కలబంద జెల్‌ను కండిషనర్, హెయిర్ మాస్క్ లేదా స్టైలింగ్ జెల్ వంటి వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది. అంతే కాకుండా జుట్టు మందంగా , బలంగా తయారవుతుంది.
కలబందను ఉపయోగించే మార్గాలు:
కండిషనర్‌గా:
కలబంద జెల్‌ను హెయిర్ కండిషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. షాంపూ చేసిన తర్వాత.. కలబంద జెల్‌ను మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత.. దానిని నీటితో శుభ్రం చేయండి. అలోవెరా జెల్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
హెయిర్ మాస్క్ గా:
అలోవెరా జెల్ ను హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు. కలబంద జెల్ ను కొబ్బరి నూనె, తేనె లేదా పెరుగు వంటి ఇతర సహజ పదార్ధాలతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టుకు పోషణ అందిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు బలాన్ని అందించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
తలపై చర్మం:
కలబంద జెల్ తల చర్మంపై దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. అలోవెరా జెల్ ను నేరుగా తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
జుట్టు పెరుగుదలకు:
అలోవెరా జెల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు మూలాలపై కలబంద జెల్ రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రం చేసుకోండి.
Also Read: వారానికి ఎన్ని సార్లు.. తలస్నానం చేయాలో తెలుసా ?
హెయిర్ స్టైలింగ్ కోసం:
అలోవెరా జెల్ ను హెయిర్ స్టైలింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు అలోవెరా జెల్ రాసి మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. ఇది జుట్టును ఆరోగ్యంగా , మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరం అయిన పోషణను కూడా అందిస్తుంది. తరచుగా అలోవెరా జెల్ జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే కూడా అలోవెరా జెల్ ఉపయోగించడం చాలా బెటర్.