Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మ, ఆరు స్కూల్‌కు వస్తారు. పిల్లలను చూసిన ఆరు ఎమోషనల్ ఆపుకోలేక పరుగెత్తుకెళ్లి వారిని హగ్ చేసుకుంటుంది. మిస్సమ్మ విచిత్రంగా చూస్తుంది. పిల్లలను హగ్ చేసుకున్న ఆరు అంజు తల్లి అనగానే.. అంజు కూడా అంతే ఎమోషనల్‌గా అమ్మా అని పిలుస్తుంది. ఇంతలో మిస్సమ్మ దగ్గరకు వచ్చి అనామిక గారు చాలా రోజుల తర్వాత పిల్లలను చూసినట్టు ఎందుక అంత ఎమోషనల్ అయ్యారు అని అడుగుతుంది. అంజు కూడా మాకెందుకు సారీ చెప్పావు అని అడుగుతుంది. అమ్ము కూడా ఎందుకు అంత కొత్తగా మాట్లాడావు అని అడగ్గానే..
అనామిక ఉరఫ్ ఆరు పొద్దటి నుంచి మిమ్మల్ని చూడలేదు కదా..? అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే అని చెప్తుంది. ఇంతలో అమ్ము గేమ్ స్టార్ట్ అవుతుందని చెప్పగానే.. అనామిక, అమ్ము వెళ్లిపోతారు. ఆనంద్, ఆకాష్ లను మీరు రెడీగా ఉన్నారా..? అని మిస్సమ్మ అడుగుతుంది. రెడీగానే ఉన్నామని చెప్తారు. ఇంతలో అంజు అనుమానంగా నువ్వు అనామిక వచ్చారు సరే.. గేమ్స్ వరకు నన్ను దత్తత తీసుకుని గాలికి వదిలేసిన మనోహరి ఆంటీ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ నువ్వే అన్నావు కదా..? గాలికి వదిలేసిన ఆంటీ అని నువ్వే వెళ్లి వెతుక్కో అని చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు మనోహరి, బాబ్జీ తో కలిసి స్కూల్ దగ్గరకు వస్తుంది. స్ప్రే తీసుకొచ్చావా..? అని అడుగుతుంది బాబ్జీని. బాబ్జీ తీసుకొచ్చిన స్ర్పే ఇవ్వగానే.. ఇది ఆ అమ్ముకు చేతికి కొట్టి.. అమ్ము గేమ్స్‌లో ఓడిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తుంది. దీంతో మీ క్రిమినల్ బ్రెయిన్‌కు హాట్సాప్ మేడం అంటాడు. పొగుడుతున్నావా..? తిడుతున్నావా..? అని మనోహరి అడగ్గానే.. కన్న కూతురినే అనాథ శరనాలయంలో వదిలేసిన మిమ్మల్ని తిడతానా..? అంటాడు బాబ్జీ. దీంతో మనోహరి నా కూతురు గురించి నాకు లేని బాధ నీకెందుకురా అంటూ తిట్టగానే బాబ్జీ సరే మేడం అంటూ వెళ్లిపోతాడు.
పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరకు వచ్చి డాడీ వస్తున్నారా..? అని అడుగుతారు. దీంతో మిస్సమ్మ రావాలని చాలా ట్రై చేశారు అమ్ము. కానీ కుదరలేదంట నాన్నా రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు అని చెప్తుంది. దీంతో అంజు ఒకసారి డాడీకి కాల్ చేసి అడుగుదాము అంటుంది. మనం అడిగితే తప్పకుండా వస్తారిన ఆనంద్ అంటాడు. సరేనని మిస్సమ్మ , అమర్‌కు కాల్ చేస్తుంది. అమ్ము హలో డాడ్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి మీరు పక్కనే ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. స్కూల్‌కు వస్తారా..? అని అడుగుతుంది. అమర్ సారీ అమ్ము నేను రాలేను మీరు బాగా ఫర్మామ్ చేయండి అని చెప్తాడు. ఇంతలో అనామిక.. అమ్ము ఒకసారి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను.. హలో రావడానికి ట్రై చేయండి. అక్కడ మీ పనేంటో తెలియదు. మీ అవసరం ఏంటో తెలియదు. కానీ మీరు పిల్లల పక్కన ఉండటం చాలా అవసరం అండి అని చెప్పగానే.. అమర్ ఎమోషనల్‌గా ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు.
దీంతో ఆరు నేనండి ఆ.. అనామికను అంటుంది. దీంతో నా అవసరం అక్కడ ఉందని తెలుసు అనామిక కానీ అక్కడ భాగీ ఉందన్న నమ్మకంతో ఇక్కడ నా పని చేసుకుంటున్నాను. ఒక్కసారి ఫోన్ పిల్లలకు ఇవ్వు అని చెప్తాడు. పిల్లలకు ధైర్యం చెప్తాడు అమర్. అందరూ ఫోన్ మాట్లాడుతుంటే మనోహరి మాత్రం బాబ్జీ ఇచ్చిన స్ర్పే బాడ్మింటన్ బాట్‌కు చేస్తుంది. మరోవైపు స్కూల్‌లోకి వచ్చిన టెర్రరిస్టులు మిస్సమ్మను చూస్తారు. మిస్సమ్మ కూడా వాళ్లను చూస్తుంది. అమర్‌కు ఫోన్ చేసి విషయం చెప్తుంది. అక్కడికి అమర్ ఫోర్స్‌తో వస్తాడు. టెర్రరిస్టులు భయంతో అక్కడి నుంచి పారిపోతారు.
తర్వాత గేమ్స్ ప్రారంభమవుతుంటే.. మిస్సమ్మ మైక్ తీసుకుని హల్లో స్టూడెంట్స్ అంటూ రేడియో మిర్చిలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. దీంతో పిల్లులందరూ ఆశ్చర్యపోతారు. మనోహరి షాక్ అవుతుంది. ఆరు గతం గుర్తుకు చేసకుంటుంది. అంజు ఆశ్చర్యంగా అమ్ము ఈ వాయిస్ అని అడుగుతుంది. అవును ఆర్‌జే భాగీది అని అమ్ము చెప్తుంది. తిరిగి చూడగానే మిస్సమ్మ కనబడుతుంది. దీంతో అంజు డాడ్ అమ్మ ఫేవరెట్ ఆర్‌జే భాగీ కదా అని అడుగుతుంది. ఆర్‌జే భాగీ మన మిస్సమ్మనా..? అని అడగ్గానే.. అమర్ అవునని చెప్తాడు. దీంతో పిల్లలు సంతోషంగా వెళ్లి మిస్సమ్మను హగ్ చేసుకుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?