Tips For Hair Wash: అందమైన, పొడవాటి జుట్టు అంటే.. అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ప్రతి ఒక్కరూ తమ జుట్టు రాలుతుంటే మాత్రం ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడతారు. అంతే కాకుండా కొంతమంది నేచురల్ హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జుట్టు రాలడం మాత్రం ఆగదు.
ఇదిలా ఉంటే జుట్టు సంరక్షణ కూడా కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా జుట్టుపై పేరుకుపోయిన దుమ్ము, దూళితో పాటు చుండ్రును తగ్గించాలంటే హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇందులో ప్రధానమైనది జుట్టును శుభ్రం చేయడం. చాలా మందికి వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలనే అంశంపై సందేహం ఉంటుంది. మరి ఇందుకు సంబంధించిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం
రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుందని, మురికి అంతా పోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి ?
నిజానికి.. జుట్టు రాలడం సమస్య ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ జుట్టు చాలా జిగటగా, జిడ్డుగా ఉంటే.. మీరు ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. కానీ మీ జుట్టు పొడిగా ఉంటే.. మాత్రం వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి. మీ జుట్టు సాధారణంగా ఉంటే.. వారానికి రెండు నుండి మూడు సార్లు తలస్నానం చేయడం ముఖ్యం. ఇలా కాకుండా కొంతమంది ప్రతి రోజూ షాంపూతో జుట్టును వాష్ చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. కాబట్టి వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.
ఈ తప్పులు అస్సలు చేయకండి:
మీరు మీ జుట్టును షాంపూతో వాష్ చేసినప్పుడు వేడి నీటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడి నీరు జుట్టును పొడిగా, నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి మీరు తలస్నానం చేయడానికి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. అంతే కాకుండా ఎక్కువ షాంపూను కూడా వాడకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే.. మీ జుట్టు త్వరలోనే తెల్లగా మారుతుంది.
మెరుపును కోల్పోతుంది:
తరచుగా జుట్టును తలస్నానం చేయడం వల్ల జుట్టు దాని మెరుపును కోల్పోతుంది. అంతే కాకుండా జుట్టు పొడిగా కూడా మారుతుంది. జుట్టుకు పొడిగా మారినప్పుడు తప్పకుండా కొబ్బరి నూనె అప్లై చేయడం మంచిది. కొబ్బరి నూనెతో తరచుగా తలకు మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది.
జుట్టు రాలడం:
మీరు మీ జుట్టును రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూతో వాష్ చేస్తుంటే మాత్రం ఇప్పటినుండే మానేయండి. రసాయనాలు అధికంగా ఉండే షాంపూ వాడటం వల్ల జుట్టు పొడి బారిపోతుంది. దీనివల్ల జుట్టు రాలుతుంది. అందుకే జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటున్న వారు వాడే షాంపూ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
తల చర్మంపై చికాకు:
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల మీ తల పొడిగా, చికాకుగా మారుతుంది. ఇది చుండ్రుకు దారితీస్తుంది. అందుకే మీ సౌలభ్యం , జుట్టు రకాన్ని బట్టి మీ తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా చుండ్రు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
Also Read: పుదీనా జ్యూస్ తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా ?
కండిషనర్లు వాడకం:
కండిషనర్ జుట్టుకు తేమను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది. కానీ కండిషనర్ అధికంగా వాడినా కూడా జుట్టు దెబ్బతింటుంది.ఇవే కాకుండా తడి జుట్టును పొరపాటున కూడా దువ్వకూడదని, తడి జుట్టు చుట్టూ టవల్‌ను ఎక్కువసేపు చుట్టి ఉంచకూడదని గుర్తుంచుకోండి.