Plant: అలోవెరా.. ఈ కుట్టుకునే ఆకుపచ్చ మొక్క కేవలం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యం, అందం, పర్యావరణ ప్రయోజనాలతో నిండిన అద్భుతం. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫస్ట్-ఎయిడ్
అలోవెరా జెల్ అనేది ఇంట్లోనే ఫస్ట్-ఎయిడ్ కిట్ లాంటిది. దీని లావుగా ఉండే ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. కాలిన గాయాలు, చిన్న కోతలు, మొటిమలు.. ఏ సమస్యైనా అలోవెరా జెల్ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మ సమస్యలకు అద్భుతంగా సహాయపడతాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పెంచిన అలోవెరా ఆకును కట్ చేసి, తాజా జెల్‌ను నేరుగా రాస్తే సరి. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, గాయాలు త్వరగా మానేలా చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఖర్చు తక్కువ
అలోవెరా కేవలం ఔషధం కాదు, అందానికి కూడా అద్భుతం! మాయిశ్చరైజర్, ఫేస్ మాస్క్, హెయిర్ ట్రీట్‌మెంట్.. ఇలా దేనికైనా దీన్ని వాడొచ్చు. ఇంట్లో అలోవెరా ఉంటే, తేనె, కొబ్బరి నూనెతో కలిపి DIY స్కిన్‌కేర్ ఉత్పత్తులు ఇట్టే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేస్తుందట.
ఎక్కువ ప్రయోజనం
అలోవెరా బిజీ లైఫ్ ఉన్నవాళ్లకు లేదా తోటపనిలో పెద్దగా అనుభవం లేనివాళ్లకు బెస్ట్ ఛాయిస్. ఈ ఎడారి మొక్కకు రెండు వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు, ప్రకాశవంతమైన పరోక్ష కాంతిలో బాగా పెరుగుతుంది. నీటిని ఆదా చేస్తుంది, గాలిని శుద్ధి చేస్తుంది, పర్యావరణ హితంగా ఉంటుంది. చిన్న అపార్ట్‌మెంట్‌లోనైనా ఈ మొక్క ఆకుపచ్చ వాతావరణాన్ని తెస్తుంది.
మానసిక ఆరోగ్యం
అలోవెరా లాంటి తక్కువ శ్రమ అవసరమైన మొక్కలను పెంచడం ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ఆకర్షణీయమైన ఆకులు రోజూ చూస్తే శాంతమైన ఫీల్ కలుగుతుంది. అంతేకాదు, అలోవెరా ఆధునిక, స్టైలిష్ లుక్‌తో ఇంటి అలంకరణకు అదిరిపోయే అదనం.