BigTV English

OTT Movie : దేవుడి నుంచి దెయ్యాల దాకా అన్నీ ఉన్న సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : దేవుడి నుంచి దెయ్యాల దాకా అన్నీ ఉన్న సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. కంటెంట్ నచ్చితే ఇక వాటిని వదలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడుమనం చెప్పుకోబోయే సిరీస్ సుదీర్ఘంగా ఉంటుంది. ఒక్కసారి చూడటం మొదలు పెడితే ఇక ఆపకుండా చూస్తూనే ఉంటారు. ఈ సిరీస్ సామ్ విన్‌చెస్టర్, డీన్ విన్‌చెస్టర్ అనే ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

కనిపించకుండా పోయిన తమ తండ్రి జాన్ విన్‌చెస్టర్‌ను వెతుకుతూ వెళతారు అతని కొడుకులు సామ్, డీన్. వీళ్ళ తల్లిని అజాజెల్‌ అనే మాన్స్ట ర్ చంపి ఉంటుంది. దానిని కూడా కనిపెట్టి అంతం చేయాలని అనుకుంటారు. డీన్ అతీంద్రియ జీవులను వేటాడే ఒక హంటర్ గా ఉంటే, సామ్‌కు తెలివితేటలలో సామర్థ్యం ఉంటుంది.  ఈ క్రమంలో వీళ్ళు ‘ది కోల్ట్’ అనే ఒక అరుదైన ఆయుధాన్ని వెతుకుతారు. అది ఏ అతీంద్రియ శక్తి ఉన్న జీవినైనా చంపగలదు. ఈ సోదరులు అజాజెల్‌ ని పట్టుకునే క్రమంలో, ఊహించని విధంగా నరకం గేట్ తెరచుకుంటుంది. అక్కడ రాక్షసులు బయటికి రావడంతో, వాటిని ఈ సోదరులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో డీన్ ఆత్మ ఒక రాక్షసుడి ఆధీనంలోకి వెళ్లడంతో అతనికి మరణం సమీపిస్తూ ఉంటుంది.


మరోవైపు రూబీ అనే రాక్షసురాలు, సామ్‌కు సహాయం చేస్తుంది. ఆమె వల్ల డీన్‌ను రక్షించేందుకు సామ్ ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే  రాక్షసుల రాణితో యుద్ధం మొదలౌతుంది. సామ్ రాక్షస రక్తం తాగడం ద్వారా తన శక్తులను పెంచుకుంటాడు. ఆ తరువాత కొన్ని విధ్వంసకర పరినణామాలు జరుగుతాయి. కొత్త రాక్షసులు, దేవతలతో ఈ సోదరులు పోరాడుతారు. ఒక దశలో డీన్ రాక్షసుడిగా మారతాడు. చివరికి ఈ సోదరులు తమ తండ్రిని కనిపెడతారా ? తమ తల్లిని చంపిన రాక్షసులపై ప్రతీకారం తీర్చుకుంటారా ? రాక్షస రాణిని ఓడిస్తారా ?  అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : పరుగుతో కేక పుట్టించే సూపర్ ఉమెన్… ఐఎండీబీలో 7.4 రేటింగ్… ఈ సూపర్ హీరోయిన్ మూవీని ఇంకా చూడలేదా?

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘సూపర్‌నాచురల్’ (Supernatural). దీనిని ఎరిక్ క్రిప్కే రూపొందించారు. ఇది 2005 నుంచి 2020 వరకు 15 సీజన్‌లు, 327 ఎపిసోడ్‌లతో కొనసాగింది. ఇందులో ఇద్దరు సోదరులు 1967 లో అమెరికా అంతటా ప్రయాణిస్తూ దెయ్యాలు, రాక్షసులు, వాంపైర్‌లు, వేర్వోల్ఫ్‌ వంటి అతీంద్రియ జీవులను వేటాడుతుంటారు. ఈ సిరీస్ జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×