BigTV English

Alum: పటికతో.. ఇన్ని ఉపయోగాలా ?

Alum: పటికతో.. ఇన్ని ఉపయోగాలా ?

Alum: చిన్న చిన్న రోగాలకి ఎప్పుడూ డాక్టర్ ని కలవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో.. ఇంట్లో మన చేతిలోనే ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి పటిక. ఇది అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇంతకీ పటిక ఉపయోగాలు, వాటిని ఆయుర్వేదంలో ఎలా వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


పటిక అంటే ఏమిటి ?
పటికను సాధారణంగా అల్యూమినియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్‌లతో కలిపి తయారు చేస్తారు. ఇది సాధారణంగా.. జ్యోతిష్యం, ఆయుర్వేదంలో వాడే ఒక పదార్థం.

ఆయుర్వేదంలో పటిక ప్రయోజనాలు:
1. చర్మం, ముఖ సౌందర్యం:
పటికను ముఖ సౌందర్యానికి కూడా వాడొచ్చు. ముఖ్యంగా.. మీరు గనుక మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే.. పటిక పొడిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖంపై రాస్తే, అవి తగ్గిపోతాయి. అంతేకాకుండా.. గొంతు నొప్పి, పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా పటిక పొడిని కలిపి పుక్కిలిస్తే, ఉపశమనం లభిస్తుంది.


2. గాయాలకు, పుండ్లకు మందు:
చిన్న గాయాలు, పుండ్లు లేదా రక్తం కారుతున్న గాయాలకి, పటిక పొడిని పాలలో కలిపి రాస్తే, రక్తం కారటం ఆగిపోయి, గాయం త్వరగా మానిపోతుంది.

3. బాడీ డియోడరెంట్:
పటికను సహజమైన బాడీ డియోడరెంట్ గా కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా.. అధిక చెమటతో బాధపడేవారు, స్నానం చేసిన తర్వాత పటిక ముక్కను చంకల కింద రుద్దితే, చెమట వాసన తగ్గుతుంది. అంతేకాకుండా.. పటిక పొడిని నీటిలో కలిపి, పాదాలను శుభ్రం చేస్తే, పాదాల దుర్వాసన తగ్గుతుంది.

4. జుట్టు ఆరోగ్యం:
చాలా మందికి చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. అలాంటి సమస్యతో బాధపడేవారు, కొబ్బరి నూనెలో పటిక పొడిని కలిపి మసాజ్ చేస్తే, చుండ్రు తగ్గి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

5. చెవి నొప్పికి మందు:
చెవి నొప్పితో బాధపడేవారు, పటిక పొడిని కొబ్బరి నూనెతో కలిపి చెవిలో వేస్తే, నొప్పి తగ్గి, ఉపశమనం లభిస్తుంది.

6. నోటి ఆరోగ్యం:
నోటి దుర్వాసనతో బాధపడేవారు, పటిక పొడిని వేడి నీటిలో కలిపి పుక్కిలిస్తే, నోటి దుర్వాసన తగ్గి, దంతాలు శుభ్రంగా ఉంటాయి.

ముఖ్య గమనిక:
పటికను ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. దీనిని ఎక్కువగా వాడితే, చర్మం పొడిబారడం లేదా చికాకు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. దీనిని నోటి ద్వారా నేరుగా తీసుకోకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు పటికను ఉపయోగించే ముందు, నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

Related News

Star Fruit: ఈ ఒక్క ఫ్రూట్ తింటే..షుగర్ కంట్రోల్ అవుతుంది !

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఏం చేయాలి ?

Eyesight: కంటి చూపు మెరుగుపరిచే.. చిట్కాలు ఇవిగో !

Stomach Pain: ఇలా చేస్తే.. క్షణాల్లోనే కడుపు నొప్పి మాయం

Instant Energy: తరచూ అలసటగా అనిపిస్తోందా ? ఈ టిప్స్ పాటిస్తే.. ఫుల్ ఎనర్జీ

Hair Mask: సిల్కీ జుట్టు కోసం.. బెస్ట్ హెయిర్ మాస్క్ !

Big Stories

×