Malavika Mohanan:ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas ) హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న ప్రముఖ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan). ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్ (Riddhi Kumar) హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యోగి బాబు, సంజయ్ దత్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ తన సినీ కెరియర్ లో తొలిసారి చేస్తున్న రొమాంటిక్ హార్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాంబోతోంది.
మరో అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..
ఈ సినిమాతో పాటు ఈమె నటించిన మరో సినిమా ‘హృదయ పూర్వం’. ఆగస్టు 29న విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా మాళవిక మోహనన్ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో ” ‘వి ఉమెన్ వాంట్ ‘ సమావేశంలో శ్రీ శశి థరూర్ చేతుల మీదుగా స్వయంగా శక్తి అవార్డును అందుకున్నందుకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. మేము ఒకరికొకరం చూసిన వెంటనే మలయాళంలో మాట్లాడుకున్నాము. ముంబై అమ్మాయి మలయాళం పట్ల.. తన ఉత్సాహాన్ని ఆయన వ్యక్తం చేశారు.” అంటూ ఆమె రాసుకొచ్చింది.
ఫిలింఫేర్ అవార్డు కూడా..
ఇటీవల ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ లో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు శక్తి అవార్డును స్వీకరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా పంచుకుంది.
మాళవిక మోహనన్ సినిమాలు..
ప్రముఖ మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె ఆ తర్వాత నటిగా అవతారమెత్తింది. 2013లో వచ్చిన మలయాళం మూవీ ‘పట్టం పోల్’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. తెలుగు, తమిళ్, హిందీ భాషా సినిమాలలో నటించింది. ముఖ్యంగా 2020లో చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకొని రికార్డు సృష్టించింది మాళవిక.. ఇప్పటివరకు మలయాళం, హిందీ ,కన్నడ, తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె ఆ చిత్రాలు ఇటు తెలుగులో కూడా విడుదల కావడంతో అలా పరిచయం అయ్యింది. ఇప్పుడు తెలుగులో నేరుగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాతో ఈమె భారీ సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మాళవిక మోహనన్ తెలుగు సినిమా మొదటి సినిమానే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో ఈమె రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగుతుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
also read:Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!
Such an honour receiving the ‘Shakti’ award for excellence at the #WeWomenWant conclave from Mr Shashi Tharoor himself ♥️
We immediately burst into Malayalam upon seeing each other, he asked me to give his regards to @kumohanan and expressed his excitement over a Mumbai girl… pic.twitter.com/VFsBI3GF3d
— Malavika Mohanan (@MalavikaM_) August 24, 2025